Crimea Bridge Attack: కెర్చ్ బ్రిడ్జి పేల్చివేతలో ఐదుగురు రష్యా జాతీయులు.. 23టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించారు..

కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.

Crimea Bridge Attack: కెర్చ్ బ్రిడ్జి పేల్చివేతలో ఐదుగురు రష్యా జాతీయులు.. 23టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించారు..

Crimea Bridge Attack_

Crimea Bridge Attack: రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇటీవల రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్ బ్రిడ్జి పేల్చివేత ఘటనతో యుక్రెయిన్ పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. రష్యా సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులతో యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. స్థానిక ప్రజలు ప్రాణాలుసైతం కోల్పోతున్నారు. అయితే, కెర్చ్ వంతెన పేల్చివేతను సీరియస్‍గా తీసుకున్న పుతిన్ అందుకుకారకులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

Russia-ukraine war Crimea Bridge : క్రిమియా బ్రిడ్జ్‌ని డ్రోన్‌తో పేల్చేశారా? .. బ్రిడ్జ్ కింద కనిపించిన మానవరహిత బోట్‌పై పలు అనుమానాలు

కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది. ఈ పేలుళ్ల వెనుక యుక్రెయిన్ హస్తం ఉందని రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్‌బీ పేర్కొటుంది. యుక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ప్రధాన ఇంటెలిజెన్స్ విభాగం ఈ దాడికి కుట్ర పన్నినట్లు ఎఫ్ఎస్‌బీ వెల్లడించినట్లు రష్యా వార్తా సంస్థ పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వంతెన పేల్చేందుకు 23 టన్నుల పేలుడు పదార్థాలను వినియోగించారని, దీనిని నిర్మాణాలకు వినియోగించే పాలీఇథలిన్ ఫిల్మ్ లో దాచిపెట్టి తరలించినట్లు రష్యా నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఈ పేలుడు పదార్థాలు యుక్రెయిన్ రేవు పట్టణమైన ఒడెస్సా నుంచి ఆగస్టులోనే పంపించినట్లు, అవి బల్గారియా, జార్జియా, అర్మేనియాలు దాటుకొని ఇక్కడికి వచ్చినట్లు ఎఫ్ఎస్‌బీ పేర్కొటుంది.