Russia-ukraine war Crimea Bridge : క్రిమియా బ్రిడ్జ్‌ని డ్రోన్‌తో పేల్చేశారా? .. బ్రిడ్జ్ కింద కనిపించిన మానవరహిత బోట్‌పై పలు అనుమానాలు

రష్యాను క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే రైలు, రోడ్డు మార్గం అయిన కెర్చ్ బ్రిడ్జి గత రెండురోజుల క్రితం భారీ పేలుళ్లకు దెబ్బతింది. ఇది యుక్రెయిన్ పనే అని రష్యా భావిస్తోంది. కానీ యుక్రెయిన్ మాత్రం ఆ పేలుడుకు తమకు ఎటువంటి సంబంధం లేదంటోంది. బ్రిడ్జ్ పై పేలుడు ఎలా జరిగింది? అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిమియా ద్వీపకల్పం బీచ్‌ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్‌ప్లాన్‌ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

Russia-ukraine war Crimea Bridge : క్రిమియా బ్రిడ్జ్‌ని డ్రోన్‌తో పేల్చేశారా? .. బ్రిడ్జ్ కింద కనిపించిన మానవరహిత బోట్‌పై పలు అనుమానాలు

Russia-ukraine war crimea bridge

Russia-ukraine war crimea bridge : రష్యాను క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే రైలు, రోడ్డు మార్గం అయిన కెర్చ్ బ్రిడ్జి గత రెండురోజుల క్రితం భారీ పేలుళ్లకు దెబ్బతింది. ఇది యుక్రెయిన్ పనే అని రష్యా భావిస్తోంది. కానీ యుక్రెయిన్ మాత్రం ఆ పేలుడుకు తమకు ఎటువంటి సంబంధం లేదంటోంది. బ్రిడ్జ్ పై పేలుడు ఎలా జరిగింది? అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిమియా ద్వీపకల్పం బీచ్‌ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్‌ప్లాన్‌ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఈపేలుడుకు కారణం ఓ ట్రక్కు అనే అనుమానాలు మందుగా వ్యక్తం అయినా అది నిజంకాదనేలా ఉన్నాయి. ఈక్రమంలో బ్రిడ్జ్ కింద కనిపించిన ఓ మానవరహిత బోటు పలు అనుమానాలకు తావిస్తోంది. డ్రోన్ ద్వారా ఈ పేలుడు జరిపినట్లుగా భావిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ను యుక్రెయిన్ కుట్రతోనే పేల్చివేసిందని రష్యారగిలిపోతోంది. దీంతో మరోసారి యుక్రెయిన్ తో దాడులతో విరుచుకుపడుతోంది.యుక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకపడుతోంది.

Putin Tightens Security: కెర్చ్ వంతెనపై పేలుడు ఎఫెక్ట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రత కట్టుదిట్టం.. పేలుడుకు కారణం ఎవరంటే?

ఇదిలా ఉంటే క్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ కెర్చ్‌ వంతెన పేల్చివేత అని రగిలిపోతోంది రష్యా. ఈక్రమంలో ఈ దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల ఉపయోగించటానికి సిద్ధపడుతుందేమోనని ప్రపంచ వ్యాప్తంగా భయం వెంటాడుతోంది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు మాత్రం యుక్రెయిన్‌పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు మొదట అంతా భావించారు. కానీ..ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం.. నిపుణుల విశ్లేషణలు.. క్రిమియా ద్వీపకల్పం బీచ్‌ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్‌ప్లాన్‌ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

వీడియో ఫుటేజీలో రెండో కోణం చూస్తే..కెర్చ్‌ వంతెనపై పేలుడు జరిగిన సమయంలో దీనిపై ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న మరో వంతెనపై ఓ రైలు ఇంధన వ్యాగన్లతో ట్రక్కు సమీపంలోకి రాగానే భారీ పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ..ఈ పేలుడు కచ్చితంగా ట్రక్కు నుంచే జరిగినట్లు స్పష్టంగా తెలియటంలేదు. కారణం బ్రిడ్జ్ కింద కనిపించిన ఓ బోటు. ఈ ట్రక్కు రష్యా నగరమైన క్రస్నాడర్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సమీర్‌ యుసుబోవ్‌కు చెందినదిగా గుర్తించారు. పేలుడు ఘటన సమయంలో దీనిని అతడి బంధువు మఖీర్‌ యుసుబోవ్‌ నడిపినట్లు తేల్చారు. కానీ..వేర్వేరు కోణాల్లో ఈ ఫుటేజీలను చూస్తే పేలుడుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చనే అనుమానాలు బలపడతున్నాయి.

Russia vs Ukraine War: ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా.. పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనే నగరాలు.. వీడియోలు వైరల్

పేలుడు జరిగిన రోజే ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ట్విటర్‌ ఖాతా ‘ఓఎస్‌ఐఎన్‌టీ అమెచ్యూర్‌’ ఓ వీడియో క్లిప్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో వంతెనపై ట్రక్‌ ఓ చోటుకు రాగానే.. వంతెన పిల్లర్ల మధ్య నుంచి ఓ మానవరహిత బోటు తేలుతూ బయటకు వచ్చింది. ఆ మరుక్షణమే భారీ పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం తతంగం పక్కనే ఉన్న వంతెనపై అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయినట్లుగా తెలుస్తోంది. సముద్రపు డ్రోన్‌ సాయంతో ఈ దాడి చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్రిమియా బీచ్‌లోని సెవస్టపోల్‌ నౌకాదళ స్థావరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ మానవ రహిత నౌకను రష్యా దళాలు గుర్తించినట్లుగా సెప్టెంబర్ 21న ఫోర్బ్స్‌ కథనంలో పేర్కొంది. రష్యన్లు దీనిని సముద్రంలో ఓ పక్కకి నెట్టివేసి పేల్చేశారని వెల్లడించింది. ఈ నౌకను యుక్రెయిన్‌ సీక్రెట్ వెపన్ గా యుద్ధ రంగ నిపుణులు తెలిపారు. ఈ నౌక నిండా పేలుడు పదార్థాలు ఉండటంతో పేల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రదేశం యుక్రెయిన్‌కు కేవలం 150 మైళ్ల దూరంలో ఉండటం గమనించాల్సిన విషయం. ఈ బోట్‌పై సెన్సర్లు, కెమెరా, కమ్యూనికేషన్‌ పరికరాలు ఉన్నాయి. రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో దీనిని సముద్రంలోని లక్ష్యం సమీపానికి చేర్చి పేల్చివేయడానికి అనుకూలంగా ఉంది. అంటే డ్రోన్ సహాయంతో పేలుడు జరిపినట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి.

Russia-ukraine war crimea bridge : క్రిమియా బ్రిడ్జ్ పేలుడు .. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భయానక పరిణామానికి దారి తీస్తుందా?