Russia-ukraine war crimea bridge : క్రిమియా బ్రిడ్జ్ పేలుడు .. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భయానక పరిణామానికి దారి తీస్తుందా?

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర మలుపు తిరగబోతోందా? క్రిమియా బ్రిడ్జ్ పేలుడుపై రష్యా ప్రతీకారానికి దిగితే పెను విధ్యంసం తప్పదా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రశ్న భయాందోళనలకు గురి చేస్తోంది.

Russia-ukraine war crimea bridge : క్రిమియా బ్రిడ్జ్ పేలుడు .. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భయానక పరిణామానికి దారి తీస్తుందా?

Russia-ukraine war crimea bridge

Russia-ukraine war crimea bridge  : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర మలుపు తిరగబోతోందా? క్రిమియా బ్రిడ్జ్ పేలుడుపై రష్యా ప్రతీకారానికి దిగితే పెను విధ్యంసం తప్పదా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రశ్న భయాందోళనలకు గురి చేస్తోంది. క్రిమియా బ్రిడ్జ్ పేలుడుకు యుక్రెయిన్ బాధ్యత వహించకపోయినప్పటికీ ఈ బ్రిడ్జ్ పేలుడు వెనుక యుక్రెయిన్ హస్తం ఉందని తేలితే రష్యా చూస్తు ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. దీనికి సమాధానం ధీటుగా చెప్పి తీరుతుంది. ఈక్రమంలో అణ్వాయుధ దాడికి సమాయత్తం అవుతోంది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపిస్తున్నారు.

క్రిమియా బ్రిడ్జి చుట్టూ రష్యా భారీ భద్రత కల్పించింది. బ్రిడ్జి మీద పేలుడు సంభవించి కొన్ని గంటలకే మరమ్మత్తులు పూర్తిచేసి..రవాణా యథావిధిగా సాగేలా రష్యా చర్యలు తీసుకుంది. బ్రిడ్జి పేలుడు వెనక ఎవరి హస్తముందనేదానిపై మాస్కో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడులో యుక్రెయిన్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే పేలుడు దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. యుక్రెయిన్ పౌరులు ఈ ఘటనతో సంతోషంలో మునిగితేలారు. రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. మరోవైపు అణ్వాయుధ దాడికి రష్యా తన సమాజాన్ని సిద్ధం చేస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

Putin Tightens Security: కెర్చ్ వంతెనపై పేలుడు ఎఫెక్ట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రత కట్టుదిట్టం.. పేలుడుకు కారణం ఎవరంటే?

రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న రష్యా…అక్కడ ఓ కీలక నిర్మాణం చేపట్టింది. రష్యాను క్రిమియాతో కలిపేందుకు..అక్కడి నుంచి యుక్రెయిన్‌తో రాకపోకలు సాగించేందుకు వీలుగా యూరప్‌లోనే పొడవైన బ్రిడ్జి నిర్మించింది. కేవలం నాలుగంటే నాలుగేళ్లలో రైళ్లు, వాహనాల రాకపోకలకు వీలుగా 29వేల కోట్ల వ్యయంతో రోడ్డు రైల్ డబుల్ బ్రిడ్జి నిర్మించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కెర్చ్ రైలు బ్రిడ్జిని 2018లో ప్రారంభించారు. అప్పటి నుంచి క్రిమియాకు, రష్యాకు నిరంతరాయంగా రాకపోకలు సాగుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా మారింది. యుద్ధంలోనూ ఈ బ్రిడ్జిది కీలక పాత్ర. క్రిమియా వైపు నుంచి బలగాలు, ఆయుధాల తరలింపుకు ఈ బ్రిడ్జే ఆధారం.

యుద్ధంలో కీలకంగా ఉన్న బ్రిడ్జ్ యుక్రెయిన్‌ టార్గెట్‌ లిస్ట్‌లో ఉంది. అయితే యుక్రెయిన్ చేసిన దాడో..ఇంకెవరి పనో తెలియదు కానీ..ఈ బ్రిడ్జిపై శనివారం (అక్టోబర్ 9,2022)  పేలుడు జరిగింది. బ్రిడ్జిపైన వెళ్తున్న ఓ పేలుడు పదార్థాల ట్రక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్రతకు చెలరేగిన మంటలు పైన బ్రిడ్జిపై చమురు ట్యాంకులను తీసుకుని వెళ్తున్న రైలుకు అంటుకున్నాయి. వెంటనే భారీ విస్ఫోటనం జరిగింది. మంటల్లో చిక్కుకున్న కొంత భాగం సముద్రంలో కూలిపోయింది. ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. లెక్కని అందని మరణాలు భారీగా ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

క్రిమియా బ్రిడ్జి పేలుడుకు యుక్రెయిన్ బాధ్యత ప్రకటించకోలేదు. కానీ యుక్రెయిన్ పౌరులు ఈ ఘటనతో సంతోషంలో మునిగితేలారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేలా సెల్ఫీలు దిగి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏప్రిల్‌లో రష్యా అతిపెద్ద యుద్ధవాహకనౌక మాస్కోవాను యుక్రెయిన్ బలగాలు సముద్రంలో ముంచేసిన తర్వాత…రష్యాకు తగిలిన మరో ఎదురుదెబ్బ ఇదని నెటిజన్లు విశ్లేషించారు. రష్యా శక్తికి నిదర్శనంగా ఉండే మాస్కోవా, కెర్చ్ బ్రిడ్జి కూలిపోయాయని యుక్రెయిన్ రక్షణమంత్రి ట్వీట్ చేశారు. యుక్రెయిన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇది జన్మదిన కానుక అని ట్వీట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యుక్రెయిన్ హిట్‌లిస్ట్‌లో ఈ బ్రిడ్జి ఉండడంతో రష్యా ఈ ప్రాంతంలో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసింది. వచ్చీపోయే వాహనాలన్నంటినీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. ఇంతటి నిఘాను దాటుకుని పేలుడుపదార్థాల ట్రక్ బ్రిడ్జి మీదకు ఎలా వెళ్లిందనేదానిపై రష్యా అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. పేలుడు తర్వాత బ్రిడ్జి చుట్టూ మరింత భద్రత పెంచే డిక్రీపై పుతిన్ సంతకం చేశారు. ఇది యుక్రెయిన్ పనా లేకా..ఇంకెవరి హస్తమైన ఉందా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుపై సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ యుక్రెయిన్ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే క్రిమియాతో ప్రారంభం అని జెలన్‌స్కీ సలహాదారు ట్వీట్ చేశారు. అక్రమమైన ప్రతీది ధ్వంసమవుతుందని, శత్రువులు దొంగలించిన ప్రతిదాన్నీ యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అటు ఘటనపై దర్యాప్తు చేస్తున్న రష్యా పేలుడుకు సంబంధించి యుక్రెయిన్‌ ప్రమేయంపై అధికారిక ప్రకటన చేయలేదు. పేలుడులో మరణించిన ముగ్గురు..పేలుడు పదార్థాలున్న ట్రక్కుకు దగ్గరగా వెళ్తున్న కారులోని వారుగా గుర్తించారు. అయితే యుక్రెయినే ఈ పేలుడుకు పాల్పడిందని తేలితే యుద్ధం ప్రమాదకరమలుపు తీసుకునే అవకాశముందన్న ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.

పేలుడు జరిగిన కొన్ని గంటలకే బ్రిడ్జిని మరమ్మత్తులు చేసి వాహనాల రాకపోకలకు అనుమతించారు. పేలుడు అనంతరం బ్రిడ్జిపై కార్లు వెళ్తున్న వీడియోను రష్యా షేర్ చేసింది. మరోవైపు యుక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా బలగాలన్నింటినీ ఒకే కమాండర్‌లోకి తీసుకొచ్చింది మాస్కో. ఈ బలగాలన్నింటికీ వైమానిక దళ అధిపతి జనరల్ సెర్గెయ్ సురోవికన్ కమాండర్‌గా ఉంటారు. అటు రష్యా అధికార యంత్రాంగం యుక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి తన దేశాన్ని సిద్ధం చేస్తోందని జెలన్‌స్కీ ఆరోపించారు. అయితే రష్యా వాటిని ప్రయోగించడానికి సిద్దంగా ఉందని తాననుకోవడం లేదని, అయితే ప్రజల్లో మాత్రం ఆ చర్చ జరిగేలా చూస్తోందని జెలన్‌స్కీ విశ్లేషించారు.

Crimea To Russia Connecting Bridge: రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై భారీ పేలుడు.. రైలుకు మంటలు వ్యాపించి చమురు ట్యాంకర్లు దగ్దం

యుక్రెయిన్ పట్టణాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ఆక్రమించిన జపోరిజియాలో కొంత ప్రాంతం ఇంకా యుక్రెయిన్ స్వాధీనంలోనే ఉంది. అక్కడ రష్యా బలగాలు జరిపిన దాడుల్లో 17 మంది చనిపోయారని, పదులసంఖ్యలో ప్రజలు గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది.