Russia vs Ukraine War: ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా.. పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనే నగరాలు.. వీడియోలు వైరల్

యుక్రెయిన్‌పై రష్యా సైన్య ప్రతీకారం తీర్చుకుంటుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో 12మంది మరణించగా.. సోమవారం మరోసారి రష్యా సైన్యం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణి దాడులకు పాల్పడింది.

Russia vs Ukraine War: ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా.. పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనే నగరాలు.. వీడియోలు వైరల్

Russia vs Ukraine War

Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై రష్యా సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. రష్యాను క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే రైలు, రోడ్డు మార్గం అయిన కెర్చ్ బ్రిడ్జి గత రెండురోజుల క్రితం భారీ పేలుళ్లకు దెబ్బతింది. ఈఘటన వెనుక యుక్రెయిన్ అనుకూల వర్గాలు ఉన్నట్లు రష్యా భావిస్తుంది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న రష్యా.. యుక్రెయిన్ పై తమ దాడులను మరింత పెంచింది. ఫలితంగా శనివారం అర్థరాత్రి వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మరణించగా, 60మందికిపైగా గాయపడ్డారు.

తాజాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మధ్యలో సోమవారం ఉదయం అనేక పేలుళ్లు సంభవించాయని నగర మేయర్ తెలిపారు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలలో భవనాల నుండి నల్లటి పొగ మేఘాలను తాకుతుంది. కీవ్‌లో నెలరోజులుగా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే స్థానిక కాలమానం ప్రకారం 8.15గంటల ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు గంట ముందు ఉక్రెయిన్ రాజధానిలో వైమానిక దాడి సైరన్‌లు మోగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.

రష్యాసైన్యం దాడుల కారణంగా అనేక మంది క్షతగాత్రులుగా మారారని కీవ్‌లోని ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి అన్నారు. ఈ ఉదయం కీవ్‌పై క్షిపణి దాడుల ఫలితంగా ఎనిమిది మంది పౌరులు మరణించారు. 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రికి సహాయకుడు తెలిపారు. దాడి తర్వాత ఆరు కార్లు మంటల్లో చిక్కుకున్నాయని, 15 వాహనాలు దెబ్బతిన్నాయని రోస్టిస్లావ్ స్మిర్నోవ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. లైవ్, టెర్నోపిల్, ఖ్మెలిన్‌టిస్కీ, జైటోమిర్, క్రోపివిన్‌టిస్కీలలో కూడా పేలుళ్లు సంభవించినట్లు తెలిసింది.

ఉక్రెయిన్‌లో జరిగిన పేలుళ్లలో చాలా మంది చనిపోయారని, గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్‌స్కీ తెలిపారు. రష్యా మమ్మల్ని నాశనం చేయడానికి, ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తుందని జెలన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.