బంగ్లాదేశ్ లోని 300ఏళ్ల నాటి దేవాలయాన్ని మళ్లీ నిర్మించనున్న ఇండియా

300ఏళ్ల క్రితం శ్రీశ్రీ జోయ్ కాళీ మాతా మందిరాన్ని ఇండియా తిరిగి నిర్మించనుంది. బంగ్లాదేశ్ లోని నార్తరన్ నాటోర్ జిల్లాలో ఈ గుడి ఉంది. ఇండియన్ గ్రాన్ అసిస్టెన్స్ ఆఫ్ బంగ్లాదేశీ దీని కోసం 97లక్షలకు కేటాయించనుంది. మొత్తం దీనికి కోసం 1.33కోట్ల బంగ్లాదేశ్ కరెన్సీని ఇండియా వెచ్చించనుంది. ఈ ఈవెంట్ ను బంగ్లాదేశ్ స్టేట్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జునైద్ అహ్మద్ పాలక, ఇండియన్ హై కమిషనర్ రివా గంగూలీ దాస్, ఎంపీ షఫీఖుల్ ఇస్లాం. మేయర్ ఉమా చౌదరి జోల్లీ సమక్షంలో ప్రారంభించారు.

హై కమిషన్ ఆఫ్ ఇండియా పురాతన దేవాలయ నిర్మాణానికి సపోర్ట్ చేస్తుంది. మా వారసత్వ సంపదను కాపాడేందుకు భారత ఇలాంటి పనులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నాం. అని బంగ్లాదేశ్ మంత్రి అన్నారు.

డెవలప్‌మెంట్ కు నాటోర్ రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో ఇండియా మా వైపు ఉంటుందని ఆశిస్తున్నాం అని బంగ్లాదేశ్ మినిస్టర్ వెల్లడించారు.

శ్రీశ్రీ జోయ్ కాళీ మాతా టెంపుల్ నాటోర్ లోని పురాతన ఆలయాల్లో ఒకటి. 18వ శతాబ్దం ఆరంభంలో దయారామ్ రాయ్ దీనిని నిర్మించారు. ఆయన రాణి భాహనీ వద్ద దివాన్ గా ఉండేవారు. ఈ గుడి ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది. ఏటా దుర్గా, కాళీ పూజలను గుడి వద్ద జరుపుకుంటారు. ఆ దేశంలో ఇంకా ఇండియా రామకృష్ణ గుడి, శ్రీశ్రీ ఆనందమోయీ కాళీ మాతా మందిర పునర్నిర్మాణాలకు నిధులు సమకూరుస్తుంది.