Singapore PM fLee Hsien :నెహ్రూపై సింగపూర్‌ ప్రధాని ప్రశంసలు..భారత ఎంపీల నేరచరిత్రలపై..సంచలన వ్యాఖ్యలు

భారత మాజీ ప్రధాని నెహ్రూపై సింగపూర్‌ ప్రధాని ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రస్తుతం భారత లోక్ సభ ఎంపీల నేరచరిత్రలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు సింగపూర్ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌.

Singapore PM fLee Hsien Loong crime cases On India MPs:  భారత్ లో ఎంపీల నేర చరిత్ర ఏకంగా సింగపూర్ వరకు పాకింది. భారత్ ఎంపీల్లో సగంమంది నేరచరిత్ర గలవారేనని సింగపూర్ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. సభలో సింగపూర్ ప్రధాని లీ సియెన్ మాట్లాడుతూ..భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో భారత లోక్ సభలో సగంమంది ఎంపీలు నేర చరిత్ర ఉననవారేనని అన్నారు. సగంమంది ఎంపీలపై అత్యాచారం, మర్డర్ల వంటి అభియోగాలున్నాయని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కార్యకలాపాలు సాగించాలన్న అంశంపై సింగపూర్‌ పార్లమెంట్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో లీ మంగళవారం (ఫిబ్రవరి 15,2022) దివంగత ప్రధాని నెహ్రూని ప్రసంశలతో ముంచెత్తారు. అలాగే ఎంపీల నేర చరిత్ర గురించి వ్యాఖ్యలు చేశారు.

నెహ్రూతో పలువురు భారత నేతలు ఉన్నత ఆదర్శాలతో, సమున్నతమైన విలువలతో ఎందరో గొప్ప నేతలు దేశాలకు పునాదులు నిర్మించారని అన్నారు ఆయన.. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూను గురించి పలు విషయాలు మాట్లాడారు. భారత్‌ను నెహ్రూ ఇండియాగా అభివర్ణించారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకున్న నేతలను ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు గుర్తించడం లేదని ఆయన ఆరోపించారు. అప్పటి విలువలు ఇప్పుడు లేవన్నారు లీ.

‘చాలా మ‌ట్టుకు దేశాల‌న్నీ గొప్ప గొప్ప ఆద‌ర్శ భావాలు, ఉన్న‌తమైన వ్య‌క్తిత్వాలను ఆధారంగా చేసుకొనే ఏర్ప‌డ‌తాయి. వాటి జైత్ర‌యాత్ర‌ను ప్రారంభిస్తాయి. యాత్ర ప్రారంభంలో ఏ సిద్ధాంతాలు, ఆద‌ర్శాల‌ను పెట్టుకుంటాయో.. ఎప్ప‌టికీ వాటి ప్ర‌యాణం ఆ సిద్ధాంతాల ప్రాతిప‌దిక‌గానే న‌డ‌వ‌దు. మెల్లి మెల్లిగా అవన్నీ ప‌క్క‌కు వెళ్లిపోతాయి. అలా అవి కనుమరుగు అయిపోతాయని లీ అన్నారు.

‘చాలా మ‌ట్టుకు దేశాల‌న్నీ గొప్ప గొప్ప ఆద‌ర్శ భావాలు, ఉన్న‌తమైన వ్య‌క్తిత్వాలను ఆధారంగా చేసుకొనే ఏర్ప‌డ‌తాయి. ప్రారంభంలో ఏ సిద్ధాంతాలు, ఆద‌ర్శాల‌ను పెట్టుకుంటాయో.. ఎప్ప‌టికీ వాటి ప్ర‌యాణం ఆ సిద్ధాంతాల ప్రాతిప‌దిక‌గానే న‌డ‌వ‌దు. మెల్లిగా అవన్నీ ప‌క్క‌కు వెళ్లిపోతాయి. అలా కొన్నాళ్లకు కనుమరుగు అయిపోతాయి. స్వాతంత్రం కోసం పోరాడే వ్య‌క్తులు ఎప్పుడు..ఎంతో ఓపిక‌గా ఉంటారు. స్వాతంత్ర పోరాటంలో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న క్రమంలో వారికి చక్కటి అవగాహనతో పాటు సమన్వయం కూడా ఉంటుందని అన్నారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో నాయ‌కుడిగా ఎదుగుతారు. భార‌త మాజీ ప్ర‌ధాని నెహ్రూ ఈ కోవ‌లోని వారే’ అంటూ సింగ‌పూర్ ప్ర‌ధాని లీసీన్ లూంగ్ అభివ‌ర్ణించారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి నెహ్రూ ఓ దిశ‌నిర్ధేశాన్ని చూపించార‌ని, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికే స‌మ‌యాన్ని కేటాయించారని అన్నారు. . దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని నెల‌కొల్ప‌డంలో నెహ్రూ పాత్ర‌ను ఎవ‌రూ కాద‌న‌లేర‌ని సింగ‌పూర్ ప్ర‌ధాని లూంగ్ స్పష్టంచేశారు. ఈ చర్చ సందర్భంగా ప్రధాని లీ సింగపూర్‌ కాపాడుకుంటున్న విధానాలను తర్వాతి తరాలు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ అక్కడి సభ్యులకు హితవు పలికారు. కాగా సింగపూర్ ప్రధాని లీ చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది. ఈ అంశంపై భారత్‌లోని సింగపూర్‌ హైకమిషనర్‌కు గురువారం సమన్లు కూడా జారీ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు