Most Languages Country : భారత్ కంటే ఎక్కువ భాషలు ఉన్న దేశం ఏదో తెలుసా..?

భారత్ కంటే ఎక్కువ భాషలు ఉన్న దేశం ఏదో తెలుసా..? భారత్ లో ఎన్ని భాషలు, ఎన్ని యాసలు ఉన్నాయో తెలుసా.?

most languages country in the world

Most Languages country In the World : భారతదేశం పలు కులాలకు, మతాలకు, తెగలకు నిలయం. దేశ వ్యాప్తంగా ఎన్నో భాషలున్నాయి. మరెన్నో యాసలున్నాయి. భారత్ లో చాలా భాషలకు లిపిలేదు. కేవలం మాట్లడుకోవటానికే తప్ప రాయటానికి లేని భాషలున్నాయి. భారత్ లో 800ల బాషలు..2000 యాసలు ఉన్నాయని అంటారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో మాట్లాడే భాషల సంఖ్య 456. ప్రపంచంలో అత్యధిక భాషలు ఉన్న దేశాల్లో భారత్‌ది నాల్గవ స్థానంగా ఉంది.

రాజభాషగా చెప్పుకునే సంస్కృతం కేవలం పుస్తకాలకే పరిమితమైంది. దీని వాడుక..మాట అనేది స్పష్టంగా వాడకంలో లేదు. సంస్కృతంతో పాటు ఎన్నో భాషలు పుస్తకాలకే పరిమితమయ్యాయి. మరికొన్నింటికి లిపి కూడా లేక కేవలం మాటలకే పమితంగా ఉండిపోయాయి. ఇంకా భారత్ వ్యాప్తంగా చాలా భాషలు అంతరించిపోయాయి.

భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలతో పాటు భాషా వైవిధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, దుస్తులు, జీవన విధానం, ఆహారపు అలవాట్లు అన్ని భిన్నంగానే ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలు ఒక్కో మాండలికాలు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో కూడా మాండలికాల్లో చాలా తేడాలుంటాయి. కర్ణాటకలో కన్నడ రాష్ట్ర భాష అయితే, మాండలికాల లిస్టు చాలా భారీగానే ఉంటుంది.

ప్రపంచంలో ఎక్కవు భాషలు కలిగిన దేశంగా భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాపువా న్యూ గినియా మొట్టమొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో మాట్లాడే భాషల సంఖ్య 456గా ఉంటే పాపువా న్యూగినియాలో 840 భాషలుగా ఉండి మొదటిస్థానంలో ఉంది.

పాపువా న్యూ గినియా తరువాత ఎక్కువ భాషలు మాట్లాడే దేశంగా రెండో స్థానంలో ఇండోనేషియా ఉంది.
ఇండోనేషియాలో 715 భాషలు మాట్లాడుతారు..
అలాగే ఆఫ్రియా దేశమైన నైజీరియా 527 భాషలతో 3వ స్థానంలో ఉంది..
నాలుగో స్థానం భారత్‌ది కాగా, 335 భాషలతో అమెరికా 5వ స్థానంలో ఉంది.
యూఎస్ఏ 337 భాషలు..
ఆస్ట్రేలియాలో 317 భాషలు..
చైనాలో 307 భాషలున్నాయి. ఎథ్నోలాగ్ ప్రకారం..చైనాలో 307 భాషలు మాట్లాడతారు. వాటిలో 279 దేశానికి చెందినవే..
పాకిస్తాన్ భౌగోళికంగా చిన్నది అయినా బలూచి,సింధ్‌తో సహా ప్రతి ప్రావిన్స్‌లో వేర్వేరు భాషలు, ఆపై కమ్యూనిటీల భాషలు ఉన్నాయి.
పాకిస్థాన్‌లో 85 భాషలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 40కి పైగా భాషలు అంతరించిపోతున్నాయి.
ఇజ్రాయెల్‌లో 53 భాషలు మాట్లాడతారు..
పాలస్తీనాలో 10 భాషలు ఉన్నాయి.

కాగా భారత్ లో తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ,గుజరాతీ,మలయాళం,బెంగాలీ,అస్సామీ,మణిపురి, నేపాలీ, ఒడియా,తమిళ, ఉర్ధూ, కొంకణీ,పంజాబీ అలాగే బోడీ వంటి పలు భాషలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి మాతృభాషగా ఉన్నాయనే విషయం తెలిసిందే.