Sri Lanka Crisis: లంకకు చమురు సరఫరా చేసిన భారత్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జయసూర్య

భారత్ పొరుగు దేశం శ్రీలంకలో రోజురోజుకు ఆర్థిక, ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చుతుంది. ఆ దేశంలో ఏ వస్తువు కొందామన్నా వందలు, వేలల్లోనే ఖర్చు చేయాల్సిన వస్తుంది..

Sri Lanka Crisis

Sri Lanka Crisis: భారత్ పొరుగు దేశం శ్రీలంకలో రోజురోజుకు ఆర్థిక, ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చుతుంది. ఆ దేశంలో ఏ వస్తువు కొందామన్నా వందలు, వేలల్లోనే ఖర్చు చేయాల్సిన వస్తుంది. ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆహార పదార్థాల కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. మరోవైపు రాజకీయ సంక్షోభం కూడా తోడవ్వడంతో ఆ దేశంలో రానురాను పరిస్థితులు మరింత దిగజారే ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు భారత్ అండగా నిలుస్తుంది.

sri lanka crisis: కలిసి పనిచేద్దాం రండి.. ప్రతిపక్ష పార్టీలను కోరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స

ఇప్పటికే ఆ దేశానికి బియ్యంను ఎగుమతి చేస్తుండగా, తాజాగా చమురు సాయాన్ని అందిస్తోంది. బుధవారం 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ తో రెండు కన్సైన్మెంట్లను శ్రీలంకకు అందజేసినట్లు శ్రీలంకలోని భారత్ రాయబార కార్యాయలం ట్విటర్ వేదికగా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ ఆ దేశానికి 2.7లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ తన వంతు సాయం చేస్తుండటం పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృజ్ఞతలు తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ తమ దేశానికి సహాయం చేస్తూనే ఉందని ప్రశంసించారు. మా పెద్దన్న భారత్ అంటూ జయసూర్య కొనియాడారు.