Sri lanka crisis : ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు..కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900లు

ఆకలి కేకలతో అలమటిస్తున్న శ్రీలంకలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా రోజు రోజుకు దిగజారిపోతోంది. పసిపిల్లలకు పట్టేందుకు గుక్కెడు పాలు కూడా దొరకటంలేదు.

Sri lanka crisis : ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు..కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900లు

Sri Lanka Crisis

Sri lanka crisis :ఆకలి కేకలతో అలమటిస్తున్న శ్రీలంకలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా రోజు రోజుకు దిగజారిపోతోంది. పసిపిల్లలకు పట్టేందుకు గుక్కెడు పాలు కూడా దొరకటంలేదు. కడుపునిండా తినేమాట పక్కనపెట్టి పట్టెడుమెతుకులు తినటానికి కూడా కరవైన దుస్థితి శ్రీలంకలో నెలకొంది. కిలో బియ్యం రూ.220, పాలపొడి ప్యాకెట్ రూ.1900లు అమ్ముతోంది. దీంతో ప్రజలను నానా పాట్లు పడుతున్నారు. గత శనివారం (ఏప్రిల్ 2,2022) కర్ఫ్యూ విధించటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు శ్రీలంక చరిత్రలోనే ఎప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభంతో లంకేయులు అల్లాడిపోతున్నారు.

శ్రీలంక అన్నమో రామచంద్ర అంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణంతో భారీగా పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యులను పస్తులుండే పరిస్థితికి తీసుకొచ్చాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా శ్రీలంక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు కూడా ఆకాశన్నంటడంతో సామాన్య ప్రజలు ఆత్రనాధాలు చేస్తున్నారు. అనేక మంది శ్రీలంక తమిళులు భారత బాటపడుతున్నారు. అదే సమయంలో భారత్.. శ్రీలంకకు భారీ సాయాన్ని అందించింది.

Also read : Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

శ్రీలంకలో భారీగా పెరిగిన నిత్యావసర ధరలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన కరెన్సీ శ్రీలంకలో ప్రాథమిక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అపూర్వమైన ఆర్థిక మాంద్యం కారణంగా, ద్వీప దేశంలోని ప్రజలు ఇంధనం, ఆహారం, మందులు కొనడానికి గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అయినా కొంతమందికే దక్కుతోంది. మిగిలినవారంతా ఖాళీ చేతులతో వెళ్లిపోతున్నారు. దుకాణంలో సరుకులు అయిపోతున్నాయి. సరుకులకు సరిపడా డబ్బులు సామాన్యుల వద్ద ఉండటం లేదు. ఉన్నవాటితో కొనుక్కుని సరిపెట్టుకుందామంటే కిలో బియ్యం రూ.220 అమ్ముతోంది. చంటిబిడ్డలకు పాలు పడదామంటే పాలపొడి ప్యాకెట్ రూ.1900లు అమ్ముతోంది.

శ్రీలంకలో కిలో బియ్యం రూ. 220 శ్రీలంక వాసులు రాజధాని కొలంబోలో సూపర్ మార్కెట్లో తమ రోజువారీ కిరాణా సామాగ్రి కోసం భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. కూరగాయల ధరలు ఇటీవలి వారాల్లో రెండింతలు పెరిగాయి, బియ్యం, గోధుమలు వంటి ప్రధాన వస్తువులు వరుసగా కిలో రూ. 220, రూ. 190 చొప్పున విక్రయిస్తుండటం గమనించాల్సిన విషయం.

Also read : Russian Soldiers Poisoned Food : రష్యా సైనికులకు విషాహారం పెట్టిన యుక్రెయిన్ పౌరులు.. ఇద్దరు మృతి

శ్రీలంక ద్రవ్యోల్బణం 17.5 శాతానికి చేరింది. దీంతో కిలో పాలపొడి 1900 కిలో పంచదార రూ.240 పలుకుతున్నాయి.  ఒక్క గుడ్డు ధర రూ. 30. 1 కిలోల పాలపొడి ప్యాక్ ఇప్పుడు రూ.1900కి రిటైల్ అమ్ముతోంది. ఫిబ్రవరిలో శ్రీలంక రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 17.5 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 25 శాతానికి పైగా పెరిగింది. తృణధాన్యాల ధరలు ఏమాత్రం అందుబాటులో లేవు.ఇక మందులు, పాలపొడి కొరత మామూలుగా లేదు. అత్యంత తీవ్రంగా ఉంది.

నిరసనలు.. కర్ఫ్యూలో శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రాజధానితో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి, నిత్యావసర వస్తువుల కొరత, సుదీర్ఘ విద్యుత్తు అంతరాయాలకు రాజపక్సే పాలనను నిందించిన ఆందోళనకారులు.విస్తృతమైన అశాంతిని అణిచివేసేందుకు, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ఆ తర్వాత సామూహిక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపునిస్తూ 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.