Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో దెబ్బకు కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. వారంతా ఆదివారం అర్థరాత్రి సమయంలో..

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

Sri Lanka Crisis

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రజాగ్రహం తీవ్రస్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా 36గంటల పాటు కర్ఫ్యూ విధించారు. శుక్రవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. అయినా ప్రజలు రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు, దేశంలో ఆర్థిక సంక్షోభానికి నిరసనగా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నించిన 600 మందిని అరెస్టు చేశారు.\

Sri Lanka crisis: సోషల్ మీడియాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే..?

ఇదిలా ఉంటే దేశంలో ఆందోళనల ఉధృతిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం సోషల్ మీడియాపైనా ఆంక్షలు విధించి. దీంతో దేశంలోని ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఆందోళన కారులను అరెస్టు చేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకొచ్చి నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని మహింద్రా రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో దెబ్బకు కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజపక్స సారథ్యంలోని కేంద్ర కేబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారు. వారంతా ఆదివారం అర్థరాత్రి సమయంలో రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను ప్రధాని రాజపక్స కు సమర్పించారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని పంపించిన లేఖలో మంత్రులు పేర్కొన్నారు.

Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. 40 వేల టన్నుల డీజిల్‌ పంపిన భారత్‌

నిజానికి ప్రజలంతా ప్రధానమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తుండగా, మహింద రాజపక్స్ కేబినెట్ మంత్రులతో రాజీనామా చేయించి, తాను మాత్రం పదవిలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని రాజపక్స సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రజల డిమాండ్ కు తలొగ్గి ప్రధాని మహింద్రా రాజపక్స తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తే ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్ కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి.