Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. 40 వేల టన్నుల డీజిల్‌ పంపిన భారత్‌

Sri Lanka Crisis : శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. 40 వేల టన్నుల డీజిల్‌ పంపిన భారత్‌

Sri Lanka Crisis 40,000 Tonnes Of Diesel From India Reaches Crisis Hit Sri Lanka

Sri Lanka Crisis : శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లంకలో ఆర్థిక సంక్షోభానికి దారితీసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే శుక్రవారం అర్ధారాత్రి శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారని తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచే దేశంలో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. సాధారణ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న లంకను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది.

Sri Lanka Crisis 40,000 Tonnes Of Diesel From India Reaches Crisis Hit Sri Lanka (2)

Sri Lanka Crisis 40,000 Tonnes Of Diesel From India Reaches Crisis Hit Sri Lanka

రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్‌ను శ్రీలంకకు భారత్ అందించింది. బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్‌ను లంకకు అప్పుగా అందించింది. భారత్‌ నుంచి 40వేల టన్నుల డీజిల్‌తో బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది. అలాగే ఈ సాయంత్రం వరకు డీజిల్ దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ.. 6 వేల టన్నుల డీజిల్‌ను లంకు అందించనుంది. లంక రవాణారంగంలో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తగినంత డీజిల్‌ అందుబాటులో లేదు. దాంతో రవాణా నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు రాజపక్స సర్కార్ భారత్‌ సాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్ లంకకు 40వలే టన్నుల డీజిల్ ను పంపించింది.

Read Also : Sri Lanka Crisis : శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స