Sri Lanka Crisis : శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స

Sri Lanka Crisis : శ్రీలంకలో అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు.

Sri Lanka Crisis : శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స

Sri Lankan President Declares State Of Emergency As Economic Crisis Triggers Unrest

Sri Lanka Crisis : శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లంకలో ఆర్థిక సంక్షోభానికి దారితీసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన దిగారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి. కరోనా దెబ్బకు శ్రీలంక ఆర్దిక వ్యవస్థ తీవ్రంగా మారింది. చిన్న పిల్లల పాలపొడి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారని ‘డెయిలీ మిర్రర్’ రిపోర్ట్ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచే దేశంలో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది.

సాధారణ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. గతకొన్నిరోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. ప్రజలు నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. అంతేకాదు.. విద్యుత్‌ కోతలు, ఇంధన కొరతతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. గురువారం రాత్రి వేలాది మంది ప్రజలు లంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. అధ్యక్ష స్థానం నుంచి రాజపక్స తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో లంక తీవ్రరూపం దాల్చడంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు గాయపడ్డారు. కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో 6 గంటల కర్ఫ్యూ విధించింది.

Sri Lankan President Declares State Of Emergency As Economic Crisis Triggers Unrest (1)

Sri Lankan President Declares State Of Emergency As Economic Crisis Triggers Unrest

అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని పోలీసు శాఖ ప్రతినిధి ప్రకటించినట్టు డెయిలీ మిర్రర్ నివేదించింది. గురువారం రాత్రి నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళనకారులు చుట్టుముట్టారు. దాంతో అధ్యక్షుడు గోటాబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం రాజపక్స ప్రభుత్వంలో వచ్చిన మార్పులకే ఈ సంక్షోభానికి కారణమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. దేశ పాలనలో స్థిరత్వం ఉండేలా చూస్తామని వాగ్దానాలు రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. శ్రీలంక ప్రస్తుత అత్యవసర పరిస్థితికి ప్రధాన కారణాల్లో ప్రభుత్వంలోని అవినీతి, బంధుప్రీతి వంటి విషయమే కారణమంటున్నారు. రాజపక్స మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, మేనల్లుడు దగ్గర ఉన్నాయి. పర్యటక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణమంటూ లంక ప్రభుత్వం చెబుతోంది. 2019లో ఈస్టర్ సండే సందర్భంగా చర్చిలపై వరుస దాడులు జరిగాయని, దీని కారణంగానే విదేశీ పర్యటకుల సందర్శనలు భారీగా తగ్గిపోయాయని తెలిపింది.

Read Also : Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు