Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు | Sri Lanka on the verge of collapsing economy inflation is so high in the country

Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు

పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. పాలు, చికెన్, కూరగాయలు, ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు

Srilanka Inflation: పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. మాంద్యం కారణంగా దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. 1990 సంక్షోభాన్ని మించి శ్రీలంకలో ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. కనీస అవసరాలు పొందేందుకు కూడా ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. పాలు, చికెన్, కూరగాయలు, ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో ఆహార పదార్థాలను కొనలేని ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంక పరిస్థితి అర్ధం చేసుకున్న భారత ప్రభుత్వం ఇటీవల $1 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించింది. అయినా తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడపుడే బయటపడే పరిస్థితిలో లేదు. దేశంలో ద్రవ్యోల్భణం ఊహించని స్థాయిలో పెరిగిపోగా.. ఆ భారం ప్రజలపై పడింది. చైనా నుంచి శ్రీలంక తెచ్చుకున్న ఆర్ధిక సహాయాలే ఈ దుస్థితికి కారణమని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read; Pakistan PM Imran : భారత్ పై పాక్ ప్రధాని పొగడ్తలు..ఐ సెల్యూట్ ఇండియా

రోడ్లు, పోర్టులు, పవర్ ప్రాజెక్టులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైనా..శ్రీలంకకు భారీగా అప్పులు ఇచ్చింది. అయితే చైనా ఇస్తున్న రుణాలను శ్రీలంక ప్రభుత్వం నియంత్రణ లేకుండా ఖర్చు చేసింది. చివరకు రుణాల తిరిగి చెల్లించే కాలవ్యవధి దాటిపోయినా ఆ రుణాలను చెల్లించలేని పరిస్థితిలో శ్రీలంక చేతులెత్తేసింది. గతేడాది ఆగష్టు నుంచే శ్రీలంకలో ఆర్ధిక వ్యవస్థ పతనమవడం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం శ్రీలంకలో ఆర్ధిక వ్యవస్థ పడిపోవడంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర మౌళికసదుపాయాల దిగుమతులపై అధికంగా ఆధారపడ్డ శ్రీలంక.. ఆయా చెల్లింపుల నిమిత్తం విదేశీమారక రేటుపై సరళమైన నిర్ణయం తీసుకోవడంతో దేశంలో ధరలు పెరిగిపోయాయని ఆర్ధిక నిపుణులు విశ్లేషించారు.

Also Read: PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు

మరోవైపు.. దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోవడంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్త మౌతుంది. ధరల నియంత్రణలో రాజపక్స ప్రభుత్వం విఫలమైందంటూ రెండు వారాలుగా ప్రజలు భారీ నిరసనలు చేపడుతున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో శ్రీలంక ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేకెత్తించింది. ఈక్రమంలో మార్చి 15న వేలాది మంది ప్రజలు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించి రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు దాడులు చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

Also read: Diesel Price Hiked : భారీగా పెరిగిన డీజిల్ ధర.. లీటర్‌పై రూ.25 పెంపు.. వారికి మాత్రమే

×