Russian Soldiers Poisoned Food : రష్యా సైనికులకు విషాహారం పెట్టిన యుక్రెయిన్ పౌరులు.. ఇద్దరు మృతి

రష్యన్‌ దళాలపై పోరులో యుక్రెయిన్‌ సేనలకు.. స్థానిక పౌరులూ తోడవుతున్నారు. విషం కలిపిన ఆహారం రష్యా సైనికులకు పంచిపెట్టగా..(Russian Soldiers Poisoned Food)

Russian Soldiers Poisoned Food : రష్యా సైనికులకు విషాహారం పెట్టిన యుక్రెయిన్ పౌరులు.. ఇద్దరు మృతి

Russian Soldiers Poisoned Food

Russian Soldiers Poisoned Food : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో తమపై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోందని యుక్రెయిన్ అంటోంది. 39వ రోజు కూడా యుక్రెయిన్ లో కొన్ని చోట్ల రష్యా బలగాల దాడులు కొనసాగాయి.

Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. దీంతోపాటు 644 యుద్ధ ట్యాంకులు, 1830 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 143 యుద్ధవిమానాలు, 134 హెలికాప్టర్లు, 89 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.(Russian Soldiers Poisoned Food)

Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

రష్యన్‌ దళాలపై పోరులో యుక్రెయిన్‌ సేనలకు.. స్థానిక పౌరులూ తోడవుతున్నారు. తమ వంతు ప్రయత్నాలతో రష్యన్ సైనికులను హతమారుస్తున్నారు. ఈ క్రమంలోనే ఖార్కివ్ ప్రాంతంలోని స్థానికులు.. విషం కలిపిన ‘పై’ అనే ఆహార పదార్థాన్ని రష్యా సైనికులకు పంచిపెట్టగా, దాన్ని తిని ఇద్దరు సైనికులు మృతి చెందారు. అంతేకాదు 28 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని యుక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. యుక్రెనియన్లు తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఆక్రమణదారులను ప్రతిఘటిస్తున్నట్లు తన ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో యుక్రెయిన్ రక్షణ శాఖ వివరించింది. బాధిత సైనికులు.. రష్యా 3వ మోటరైజ్డ్ రైఫిల్ విభాగానికి చెందినవారని తెలిపింది. మరో 500 మంది రష్యన్ సిబ్బంది విషపూరిత ఆల్కహాల్‌తో ఆసుపత్రిలో చేరారంది.

Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

ఇది ఇలా ఉంటే.. రష్యా సైనిక చర్య ప్రభావం.. యుక్రెయిన్‌ పంట ఎగుమతులపైనా పడింది. మార్చిలో యుక్రెయిన్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఫిబ్రవరితో పోల్చితే నాలుగు రెట్లు పడిపోయిందని ఆ దేశ ఆర్ధిఖ శాఖ తెలిపింది. విదేశాలకు 11 లక్షల టన్నుల మొక్కజొన్న, మూడు లక్షల టన్నుల గోధుమలు, లక్ష టన్నుల సన్‌ఫ్లవర్‌ నూనెను ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2020-2021లో యుక్రెయిన్… ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా ఉంది. అయితే, తీరప్రాంతాల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. వ్యాపారులు రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు.