Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.(Russian Soldiers Die)

Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

Russian Soldiers Die (3)

Russian Soldiers Die : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోంది. 39వ రోజు కూడా యుక్రెయిన్ లో ఇంకా కొన్ని చోట్ల రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి.

యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.

తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. దీంతోపాటు 644 యుద్ధ ట్యాంకులు, 1830 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 143 యుద్ధవిమానాలు, 134 హెలికాప్టర్లు, 89 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.(Russian Soldiers Die)

Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన రష్యా.. మరిన్ని ప్రాంతాల్లో భీకర దాడులతో తెగబడుతూనే ఉంది. ఈ క్రమంలో యుక్రెయిన్‌పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్‌ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.

మరోవైపు ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యా ఎంఐ-28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో యుక్రెయిన్‌ సైన్యం కూల్చేసింది. మిసైల్‌ ఢీకొట్టడంతో హెలికాప్టర్‌ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్‌ గైడెడ్‌ మిసైల్‌ సిస్టమ్‌ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది కనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్‌ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది.(Russian Soldiers Die)

రష్యా దగ్గర పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్‌ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, క్రూయిజ్‌ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్‌ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్‌ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి.

Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

కాగా, చర్చల్లో భాగంగా కొన్ని నగరాల్లో బలగాలను మాత్రమే తగ్గిస్తామని చెప్పిన రష్యా.. ఆ మాటనూ నిలబెట్టుకుంటోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి రష్యా దళాలు వెనక్కుమళ్లించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధం ముగిసిందని ఉక్రెయిన్‌ బలగాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ తరుణంలో.. ఉక్రెయిన్‌ సైన్యాధికారి ఒకరు.. కీలక వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం ముగిసిపోలేదని, భవిష్యత్తుల్లో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చని భద్రతాధికారి ఒలెక్సీ డానీలోవ్‌ అంటున్నారు. యుద్ధం ముగిసిందని వేడుకలు చేసుకోవడానికి ఇది తరుణం కాదని, అది తొందరపాటు చర్యే అవుతుంది. యుద్ధం భయం ఇంకా పోలేదు. అలాగే భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చని అన్నారు. యుక్రెయిన్‌ను నాశనం చేయాలనే పుతిన్‌ ఆకాంక్ష ఇంకా పూర్తి కాలేదని, ఈ గ్యాప్‌లో సైన్యాన్ని పునఃసమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాబట్టి, ఎవరూ తొందరపడి సంబరాలు చేసుకోవద్దన్నారు.

తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే రష్యన్లు వెనక్కుమళ్లారని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఆరోపించారు. వాళ్లకు విజయం కావాలని అన్నారు. మే 9వ తేదీ (నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతుంటుంది) వాళ్లకు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. కాబట్టి మనం ముందు ముందు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చని జాతిని, సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు జెలెన్‌స్కీ.