Indus Waters Treaty: పాక్ కు షాకిచ్చిన భారత్.. సింధు జలాలపై సంచలన నిర్ణయం.. ఉక్కిరిబిక్కిరవుతున్న శత్రుదేశం

భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, నీటి (Indus Waters Treaty)సంక్షోభంలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

India suspends indus waters treaty pakistan faces severe water crisis

  • సింధు జలాల ఒప్పందం నిలిపివేత
  • పాకిస్తాన్‌లో తీవ్ర నీటి సంక్షోభం
  • అంతర్జాతీయ సాయం కోసం వేడుకోలు

Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అని భారత్ స్పష్టం చేస్తూ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, నీటి సంక్షోభంలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమ దేశ ఉనికికి, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని భావిస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు వేడుకుంటూ సహాయం కోసం విజ్ఞప్తులు చేస్తోంది.

AP MBBS Fees: ఏపీ వైద్య విద్యార్థులకు షాక్.. కోర్సుల ఫీజుల పెంపు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం!

అంతర్జాతీయ వేదికపై పాక్ విదేశాంగ మంత్రి విజ్ఞప్తి:

అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నిర్వహించిన సెమినార్‌లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల తమ దేశ నీటి భద్రత దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింధు (Indus Waters Treaty)నదీ పరివాహక ప్రాంతం పాకిస్థాన్‌లోని 25 కోట్ల మంది ప్రజలకు జీవనాడి లాంటిదని, వ్యవసాయం, ఆహార భద్రత, విద్యుత్ ఉత్పత్తి అంతా ఈ నీటిపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

వాతావరణ సవాళ్లు, భవిష్యత్ పరిణామాలు:

పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కొరత, వాతావరణ మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని ఇషాక్ దార్ గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ నీటిని నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన కరువు, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని చెప్పారు. తక్షణమే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేలా భారత్‌తో చర్చలకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన అభ్యర్థించారు.