Tiger Jurny : భారత్ నుంచి బంగ్లాదేశ్ కు నడిచి వెళ్లిన పులి

భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కు 100 కిలోమీటర్లు నడి వెళ్లింది ఓ పెద్దపులి. నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి నుంచి ఓ మగ పులికి నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్లు కొండలు కోనలు..వాగులు వంకలు దాటుకుంటూ బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకుంది.

Inida Tiger Jurny to Bangladesh : మనుషులకైతే ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లటానికి వీసాలు కావాలి. ఆయా దేశాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి. కానీ జంతువులకు అటువంటి నిబంధనలేమి అవసరం లేదు. ముఖ్యంగా అడవుల్లో సంచరించే జంతువులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతుంటాయి వస్తుంటాయి. అలాగే ఒకదేశం నుంచి మరో దేశానికి కూడా వెళుతుంటాయి.అలా ఓ పెద్దపులి భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లింది. నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి నుంచి ఓ మగ పులికి నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్లు కొండలు కోనలు..వాగులు వంకలు దాటుకుంటూ బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకుంది.

ఈ పులికి రేడియో కాలర్ అమర్చటంతో అది ఎక్కడుంది? ఎంత దూరం నడిచింది అనే విషయం తెలుస్తుంది. అలా ఈ పులి నాలుగు నెలల కాలంలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగ్లాదేశ్ మడ అడవులకు చేరుకుందని తెలిసింది. సుందర్ బన్ అడవిలోని పులి కదలికలను కనుగొనేందుకు 2010లో రేడియో కాలర్ అమర్చారు. దీంతో ఆ పులి 100 కిలోమీటర్లు దాటి బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

కాగా..సుందర్ బన్స్ జాతీయ పార్కును 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కే కాకుండా భారతదేశంలోనే సఫారీలు, విహారయాత్రలకు ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ జాతీయ పార్కు గంగానదిలో అతిపెద్ద డెల్టా మరియు మడ అడవులను కలిగి ఉంది. కాగా ఓ మగపులి ఆడ తోడు కోసం నెలల పాటు నడిచి నడిచి వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు