White House: అమెరికాతో పొత్తు కాదు, ప్రపంచంలోనే శక్తి అవుతుంది.. భారత్‭పై వైట్‭హౌస్ ప్రశంసలు

భారత్ ప్రత్యేకమైన వ్యూహాత్మక పాత్రను కలిగి ఉంది. ఇది అమెరికాకు మిత్రదేశం కాదు. స్వతంత్ర, శక్తివంతమైన దేశంగా ఉండాలనే కోరిక భారత్‭కు ఉంది. రాబోయే రోజుల్లో భారత్‭ మరొక గొప్ప శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది. అయితే ఇదే సమయంలో దాదాపు ప్రతి రంగంలోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండాలని, దానికి కొన్ని కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను

White House: అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండబోదని, ఆ దేశమే ప్రపంచంలో గొప్ప శక్తిగా అవతరిస్తుందని వైట్‌హౌస్ పేర్కొంది. గడిచిన 20 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య గాఢమైన, బలోపేతమైన సంబంధాలు ఉన్నాయని, ఇవి ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి సంకేతమని వైట్‭హౌస్ తెలిపింది. గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో వైట్‭హౌస్ వైట్‌హౌస్ ఆసియా కోఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు భారతదేశం అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక దేశమని అన్నారు.

Collegium: కొలీజియం వ్యవస్థపై కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చి సుప్రీం కోర్టు

“వాస్తవం ఏంటంటే, గత 20 సంవత్సరాలుగా అమెరికాకు భారత్‭తో ఉన్నంత బలమైన, గాఢమైన ద్వైపాక్షిక బంధం మరో ఏ దేశంతో లేదని నేను అనుకుంటున్నాను” అని వైట్ హౌస్ ఉన్నతాధికారి అన్నారు. అమెరికాకు మరింత పెట్టుబడి కావాలని, ప్రజలతో సంబంధాలను పెంచుకోవడం, సాంకేతికత, ఇతర సమస్యలపై అమెరికాతో కలిసి పనిచేయడం అవసరమని ఆయన అన్నారు. “భారత్ ప్రత్యేకమైన వ్యూహాత్మక పాత్రను కలిగి ఉంది. ఇది అమెరికాకు మిత్రదేశం కాదు. స్వతంత్ర, శక్తివంతమైన దేశంగా ఉండాలనే కోరిక భారత్‭కు ఉంది. రాబోయే రోజుల్లో భారత్‭ మరొక గొప్ప శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది. అయితే ఇదే సమయంలో దాదాపు ప్రతి రంగంలోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండాలని, దానికి కొన్ని కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను” అని కాంప్‌బెల్ అన్నారు.

Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

ఇరు దేశాల్లోనూ కొన్ని నిరోధాలు ఉన్నాయని, అనేక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా, భారత్ భాగస్వామ్యం అనేది కొంత ఆశయం కలిగి ఉండవలసిన సంబంధం అని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాలు కలిసి చేయగలిగే విషయాలపై మరింత వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతరిక్షంలో అయినా, విద్య అయినా, వాతావరణంపైనా, సాంకేతికతపైనా ద్వైపాక్షికంగా ముందుకు సాగాలని కాంప్‌బెల్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు