Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్‌లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అలాగే, సిట్టింగ్ మంత్రి మహేందర్ సింగ్ తన కుమారుడు రజత్ ఠాకూర్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది

Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

8 ministers of himachal pradesh defeated

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మరోసారి అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ ఆశలపై హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నీళ్లు చల్లారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార పార్టీని ఓడిస్తూ వస్తున్న హిమాచల్ ఓటర్లు, ఈసారి కూడా అదే చేశారు. భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించారు. సర్వేలన్నింటినీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 25 స్థానాల వద్దే ఆగిపోయింది.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతికేత ఉన్నట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఎంతటి వ్యతిరేకత అంటే, ఆయన మంత్రివర్గంలోని కీలక మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్‌లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అలాగే, సిట్టింగ్ మంత్రి మహేందర్ సింగ్ తన కుమారుడు రజత్ ఠాకూర్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రజత్ కూడా ఓటమి పాలయ్యారు.

Himachal Pradesh: సంప్రదాయాన్ని మరువని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. కాంగ్రెస్ అందుకే గెలిచింది!

ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే ఆరుగురిలో ముగ్గురు ఓడిపోయారు. డల్హౌసీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి, మాజీ మంత్రులు కౌల్ సింగ్, రామ్ లాల్ ఠాకూర్ పరాజయం చవిచూశారు. నహాన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సోలంకి బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్‌పై 1,693 ఓట్లతో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగుకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్, పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‭లో అధికార బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుస్తూ వస్తున్న ప్రజలు ఈసారి కూడా తమ సంప్రదాయం ప్రకారమే ప్రభుత్వాన్ని మార్చారు. సర్వేలు సైతం ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.

Gujarat Polls: నా రికార్డు బద్ధలవుతుందని ముందే చెప్పాను: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మోదీ