Himachal Pradesh: సంప్రదాయాన్ని మరువని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. కాంగ్రెస్ అందుకే గెలిచింది!

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగుకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్, పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‭లో అధికార బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుస్తూ వస్తున్న ప్రజలు ఈసారి కూడా తమ సంప్రదాయం ప్రకారమే ప్రభుత్వాన్ని మార్చారు. సర్వేలు సైతం ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి.

Himachal Pradesh: సంప్రదాయాన్ని మరువని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. కాంగ్రెస్ అందుకే గెలిచింది!

Voters of Himachal who did not forget tradition.. That's why Congress won

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనంతరం బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఇక జనతా పార్టీ ఒకసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మూడు పార్టీలు కాకుండా వేరే ఏ పార్టీ అక్కడ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే తొలినాళ్లలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ పోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు.. ఏడో అసెంబ్లీ నుంచి ట్రెండ్ మార్చారు. ప్రతి ఎన్నికల్లో పార్టీని మారుస్తూ తీర్పు చెబుతున్నారు. 1990లో ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ సంప్రదాయం ప్రకారమే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఒకరి తరువాత ఒకరు చెరో నాలుగు సార్లు విజయం సాధించారు. ఆనవాయితీ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు హిమాచల్ ఓటర్లు. హిమాచల్ ప్రదేశ్‭లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 10 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ నాలుగుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతా పార్టీ ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగుకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్, పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‭లో అధికార బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుస్తూ వస్తున్న ప్రజలు ఈసారి కూడా తమ సంప్రదాయం ప్రకారమే ప్రభుత్వాన్ని మార్చారు. సర్వేలు సైతం ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.

Bypoll Results: ఏడు చోట్ల ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?