Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ

గుజరాత్‭లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పేరు మీద రికార్డు ఉంది. 1980లో ఆరవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే పెద్ద రికార్డు. కాగా ఈ రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది. ఈ ఎన్నికల్లో ఓట్ బ్యాంకు కూడా బీజేపీ బాగానే సంపాదించింది. సగానికిపైగా ఓట్లు బీజేపీకి పడ్డాయి.

Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ

BJP breaks own record and congress record

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. బీజేపీ చరిత్రలోనే తిరుగులేని మెజారిటీ సాధించి తన రికార్డును తానే బద్ధలు కొట్టుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రికార్డును సైతం బద్ధలు కొట్టింది. మొత్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ ఏ పార్టీ సాధించని రికార్డు విజయాన్ని బీజేపీ నమోదు చేసుకుంది. తొందరలోనే ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Results: ఎగ్టాక్ట్ పోల్స్‭కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు

తాజా ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాల్లో గెలిచింది. ఏ సర్వే సంస్థ కూడా ఊహించని విజయమిది. బీజేపీ గతంలో ఎప్పుడూ ఇంత మెజారిటీ సాధించలేదు. 2002 (11వ అసెంబ్లీ) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 127 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఆనాటి నుంచి ఎన్నికల్లో వరుస విజయాలే అయినప్పటికీ మెజారిటీ తగ్గుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

ఇకపోతే, గుజరాత్‭లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పేరు మీద రికార్డు ఉంది. 1980లో ఆరవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే పెద్ద రికార్డు. కాగా ఈ రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది. ఈ ఎన్నికల్లో ఓట్ బ్యాంకు కూడా బీజేపీ బాగానే సంపాదించింది. సగానికిపైగా ఓట్లు బీజేపీకి పడ్డాయి.

AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 156 స్థానాల్లో గెలుపొందింది. ఇక ప్రత్యర్థి కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే సాధించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఘననీయంగా ఐదు స్థానాల్లో విజయం దిశగా వెళ్తోంది. అంతే కాకుండా, 12 శాతానికి పైగా ఓట్ బ్యాంక్ సాధించింది.