Results: ఎగ్టాక్ట్ పోల్స్‭కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు

దాదాపుగా అన్ని సర్వేల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు. గుజరాత్ విషయంలో బీజేపీ విజయం నిజమే అయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుందని మాత్రం కొన్ని సర్వేలు చెప్పాయి

Results: ఎగ్టాక్ట్ పోల్స్‭కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు

Exit polls are far from exat polls. Surveys that do not meet expectations at all

Results: ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్.. అన్నిసార్లు వాస్తవంగానే ఉంటాయని చెప్పలేం. అలా అని వీటిని కొట్టిపారేయలేం. కాస్త అటుఇటుగా చాలా సందర్భాల్లో ఈ సర్వేలు చెప్పే ఫలితాలు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాల్లో ఈ సర్వేలకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తుంటాయి. గుజరాత్ అసెంబ్లీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ఫలితాలను ఈసారి ఎందుకో సరిగా అంచనా వేయలేకపోయాయి.

దాదాపుగా అన్ని సర్వేల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు. గుజరాత్ విషయంలో బీజేపీ విజయం నిజమే అయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుందని మాత్రం కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే అధికారం వైపు కాంగ్రెస్ దూసుకెళ్తుందని మాత్రం ఒక్కరు కూడా అంచనా వేయలేకపోయారు.

Gujarat Polls: గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాడించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు కనుమరుగైంది? ఆ నేత లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమా?

ఇక గుజరాత్ విషయంలో కూడా ఇదే తప్పిదం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ విజయం సాధించేలా కనిపిస్తోంది (ఫలితాలు విడుదలయ్యే సమయానికి). ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల వరకు వస్తాయని చెప్పారు. అందులో మూడో వంతు స్థానాలకే కాంగ్రెస్ పరిమితమవుతుండడం గమనార్హం. ఇక ఆప్ విషయంలో కొంత వరకు సరిగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆ సర్వేలు చెప్పినదానికి అటుఇటుగా ఆ పార్టీ లీడింగ్ సాగిస్తోంది.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 50 శాతానికి పైగా ఓట్ బ్యాంక్ సాధించింది. వాస్తవానికి త్రిముఖ పోటీలో ఇంత ఓట్ షేర్ సాధించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 27.3 శాతం ఓట్ బ్యాంకుకే పరిమితం అయింది. గత ఎన్నికల్లో 44 శాతానికి పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్, ఈసారి చాలా దిగువకు పడిపోయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం, అదే జోరుతో గుజరాత్‭లో అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. 12.9 శాతం ఓట్ బ్యాంక్ సాధించడం గమనార్హం. ఐదు స్థానాల్లో ఆ పార్టీ ప్రస్తుతం లీడింగ్ సాధిస్తోంది. ఈ నంబర్లు చూస్తుంటే, కాంగ్రెస్ ఓట్ బ్యాంకును ఆపే కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది.

Gujarat Results :గుజరాత్ ఫలితాలతో కేసీఆర్ కు నిద్ర పట్టదు