అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార మార్పిడి బృందంలో నాసా తరఫున భవ్య సభ్యురాలిగా పనిచేశారు. నాసాలో అధికారు నియామకంలో కీలకంగా వ్యవహరించారు. నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా భారత సంతతికి చెందిన భవ్యలాల్ నియమితులు అయ్యారు. ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. నాసాలో చీఫ్‌గా నియమితులైనట్లు నాసా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు భవ్యా లాల్‌ను చీఫ్‌గా నియమించినట్లు వెల్లడించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీల్లో భారతీయుల ఆధిపత్యం సాగుతుండగా.. ఆ స్థాయిలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అత్యున్నత పదవిని భారతీయురాలు దక్కించుకోవడం ఇదే తొలిసారి. భవ్య లాల్‌కు ఇంజనీరింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అపార అనుభవం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్‌లో ఆమె సభ్యురాలిగా పనిచేశారు.
సుదీర్ఘ కాలం పాటు భవ్యాలాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనా విభాగంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆ సమయంలో అంతరిక్ష పరిశోధనలను సాగించగా.. అమెరికా స్పేస్ టెక్నాలజీ, స్ట్రాటజీ సలహాదారుగా కూడా వ్యవహరించారు. డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్‌గా, వైట్‌హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్ గెస్ట్ మెంబర్‌గా కూడా ఉన్నారు. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని సాధించారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీ, అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆమె డాక్టరేట్ సాధించారు.
అమెరికా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని కమిటీలకు కోఆర్డినేటర్‌గా ఆమె పనిచేశారు. స్పేస్ టెక్నాలజీపై ఆమెకు మంచి పట్టు ఉండటంతో ఏకంగా నాసా చీఫ్‌గా నియమితులయ్యారు. ఇంజినీరింగ్ విద్యార్థినిగా న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు చేశారు. ఎంఐటీ, వాషింగ్టన్ యూనివర్శిటీల్లో ఇప్పటికీ న్యూక్లియర్ ఇంజినీరింగ్, పబ్లిక్ పాలసీ విభాగాల్లో గౌరవ శాస్త్రవేత్తగా ఉన్నారు.