Anand Mahindra: ఈ బాలిక వయసు 8 ఏళ్లు మాత్రమే.. ఎంత టాలెంట్‌ ఉందో చూడండి.. ఆనంద్ మహీంద్ర ఏమన్నారంటే?

తన టాలెంట్ ప్రదర్శించే ముందు బినిటా ఆ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది.

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆయన ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు చెబుతారు. మోటివేషనల్ వీడియోలతో ఆయన సోషల్ మీడియాలో ఆకట్టుకుంటారు.

ఆవిష్కరణలను, యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంటారు. ఆయన పోస్ట్‌లు చాలా మందికి ప్రేరణగా నిలుస్తాయి. యువతకు మాత్రమే కాదు అన్ని వయసుల వారికీ ఆయన మాటలు ప్రేరణగా నిలుస్తాయి.

అసోంకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక, బినిటా ఛెత్రీ తాజాగా బ్రిటన్‌లో తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపర్చింది. బ్రిటన్‌లో నిర్వహించిన షోలో పాల్గొన్న ఆ బాలిక వేసిన స్టెప్పులు అందరితోనూ అదుర్స్ అనిపించాయి. ఆ షోలోని జడ్జిలు ఆమె వేసిన ప్రతి స్టెప్పుకు వావ్ అనకుండా ఉండలేకపోయారు.

Also Read: లేడీ బాహుబలి.. పెళ్లికూతురు ఇలా కూడా తయారవుతుందా? ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?

దీనిపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ.. ఆ బాలిక వయసు కేవలం 8 సంవత్సరాలని, ప్రపంచ స్థాయి ప్రదర్శన ఇచ్చిందని చెప్పారు. ఆమెలో ఉక్కు సంకల్పం ఉందని అన్నారు. డ్యాన్సులో ఆమెకు ఆ పట్టు కఠిన సాధనతో మాత్రమే వస్తుందని తెలిపారు. ఆమె తన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు.

తన టాలెంట్ ప్రదర్శించే ముందు బినిటా ఆ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. “నా పేరు బినిటా ఛత్రీ.. నాకు ఎనిమిది సంవత్సరాలు. నేను ఇండియాలోని అసోం నుంచి వచ్చాను. బ్రిటన్ గాట్ టాలెంట్లో పాల్గొనడం నా కల. నేను పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనుకుంటున్నాను” అని చెప్పింది.