Covid-19 Lockdown : కోవిడ్ ముప్పు మంచు కొండల మంచి కోసమే .. పరిశోధనల్లో వెల్లడి

మరక మంచిదే అన్నట్లుగా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ (Covi-19 Virus) వల్ల కూడా మంచే జరిగిందంటున్నారు పరిశోధకులు.

Covid-19 Lockdown..Himalayas safe

Covid-19 Lockdown..Himalayas is safe : మరక మంచిదే అన్నట్లుగా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ (Covi-19 Virus) వల్ల కూడా మంచే జరిగిందంటున్నారు పరిశోధకులు. కోవిడ్ వల్ల వచ్చిన లాక్ డౌన్ (lockdown) వల్ల హిమాలయానికి (Himalayas)ముప్పు తప్పిందంటున్నారు. లాక్‌డౌన్‌ (lockdown) వల్ల హిమాలయాల్లో మంచు కరిగే ముప్పును తప్పింది అంటున్నారు. కోవిడ్ మహమ్మారి విజంభించి ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఇది బాదపడాల్సిన విషయమే. కానీ ప్రకృతికి మాత్రం కోవిడ్ వల్ల వచ్చిన లాక్ డౌన్ మంచే చేసింది. ప్రకృతికి మంచి జరిగింది అంటూ మానవాళినికి కూడా మంచి జరిగినట్లే కదా..

కోవిడ్ విజృంభణతో భారత్ లో (Indian national lockdown)మూడేళ్ల క్రితం విధించిన లాక్ డౌన్ వల్ల మంచు కొండలు అవేనండీ హిమాలయాల్లో మంచు కరిగే ముప్పును తగ్గించిందని తాజా అధ్యయనంలో తేలింది.2020లో భారత్ లో కోవిడ్ ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. దీంతో లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home)లతోనే ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు (factories Products stopped)నిలిచిపోయాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో కాలుష్య కారక పరిశ్రమలు (polluting industries)మూతపడ్డాయి. టూరిస్ట్ ప్లేసు(Tourist place)లు కూడా వెలవెలబోయాయి. కాలుష్యం కనిపించకుండాపోయింది. దీంతో హిమాలయాలు ప్రశాంతంగా ఉన్నాయి. మంచు కరిగే ముప్పు తప్పింది.

మనిసి చేసే కార్యకలాపాలతో ఉత్పత్తి అయ్యే కాలుష్య కారకాలు లాక్ డౌన్ వల్ల గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా కాలుష్యం తగ్గిటంతో భూతాపం కూడా తగ్గింది. దీంతో హిమాలయాల మంచు కరిగే ప్రమాదం తప్పిందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నెక్సస్ (National Academy of Sciences Nexus) ప్రొసీడింగ్స్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. చైనా(China)లోని బీజింగ్ నార్మల్ యూనివర్శిటీ(Beijing Normal University)కి చెందిన లికియాంగ్ ఝుంగ్ (Liqiang Zhang)నేతృత్వంలో పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయంలోనే ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇలా మొత్తంగా చూసుకుంటే 2020 మార్చి 25 నుంచి 2020 మే 31 వరకు భారతదేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మంచు కొండల మంచికే జరిగింది. కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోయి హిమాలయాల్లో 27 మెట్రిక్ టన్నుల మంచు కరిగే ప్రమాదం తగ్గించిన పరిశోధకులు గుర్తించారు.

కాగా కాలుష్యాలు పెరగటంతో భూతాపం పెరిగి హిమగిరులు కరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హిమనీనదాలు కరిగితే అత్యంత ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. టిబెట్ పీఠభూమిపై మంచు ప్రపంచ జనాభాలో 20శాతానికి పైగా నీటి వనరులుగా ఉంది. కానీ ఇటీవల దశాబ్దాలుగా వేగంగా మంచు కరిగిపోతోంది. ఇది వాతావరణంలో పెను మార్పులకు దారితీస్తోంది. దీంట్లో వాయుకాలుష్యం ప్రధాన పాత్ర వహిస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు