Afghanistan (2)
Afghanistan : అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.. అఫ్గానిస్థాన్ రాజధాని నగరంలో ఇతర దేశాలకు చెందిన చాలా మంది ఇరుక్కుపోయారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.
ఓ భారత వ్యక్తి పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను కాబూల్‌లో చిక్కుకున్నానని, ఎలా బయటకు రావాలో తెలియడం లేదని ఆ వీడియోల ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ చిక్కుకున్న భారతీయులను ఎలాగైనా కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
వీడియోలో ఉన్న వ్యక్తి పేరు గురు నాయక్‌గా తెలుస్తోంది. తాను రెండు టిక్కెట్లు బుక్ చేసినట్లు కానీ అవి రెండు క్యాన్సల్ కావడంతో ఇక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఇక్కడే ఓ హోటల్ లో స్టే చేసినట్లు వివరించాడు సదరు వ్యక్తి. తమను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు