Justin Narayan : ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్-2021 టైటిల్ గెలుచుకున్న భారత మూలాలున్న జస్టిన్ నారాయణ్

Indian origin Justin Narayan wins MasterChef Australia : భారతీయులు ఏదేశంలో ఉద్యోగాలు చేసినా..ఏఏ దేశాల్లో స్థిరపడినా వారి ప్రతిభతో ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రెండు మూడు రోజుల క్రితం అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చి తెలుగమ్మాయి శిరీష ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు ప్రవాస భారతీయుడు జస్టిన్ నారాయణ్. అతను ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.

అతను ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్-2021 టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు జస్టిన్నారాయణ్. మాస్టర్ చెఫ్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతునే ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో జరిగే ఈ పోటీలకు మాత్రం వరల్డ్ టాపెస్ట్ గేమ్ షోగా మంచి పేరుంది. ఈ పోటీల్లో పాల్గొని టైటిల్ విన్నర్ కావటం అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద పేరు పొందిన చెఫ్ ల వల్ల కూడా అవ్వదు. కానీ ప్రవాస భారతీయుడు జస్టిన్ నారాయణ్ ఆ ఘతన సాధించారు.

27 సంవత్సరాల నారాయణ్ ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్ 13 సీజన్ పోటీల్లో ఫైనల్ కు చేరుకున్నారు. అతని కంటే ముందు ఫైనల్ కు చేరుకున్న కిశ్వర్ చౌదరిని, బంగ్లాదేశ్ కు చెందిన పీట్ కాంప్ బెల్ ను ఓడించి చెఫ్-2021 టైటిల్ ను గెలుచుకున్నారు జస్టిన్ నారాయణ్. ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్-2021 టైటిల్ విజేతగా నిలిచారు. మాస్టర్ చెఫ్ 13వ సీజన్ లో విజేతగా నిలిచిన జస్టిన్ నారాయణ్ టైటిల్ ట్రోఫీ అందుకోవడంతో పాటు రివార్డు ప్రైజ్ మనీగా ఆస్ట్రేలియన్ కరెన్సీ డాలర్ గా 250,000 అంటే భారత కరెన్సీలో రూ.కోటికి పైగా గెలుచుకున్నారు.

కాగా..ప్రవాస భారతీయుడు జస్టిన్ నారాయణ్ ఆస్ట్రేలియన్ చెఫ్-2021 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా మరో విషయం చెప్పుకోవాలి. 2018లో కూడా ఈ వరల్డ్ టాపెస్ట్ కుకింగ్ షో టైటిల్ ను భారతీయ మూలాలు ఉన్న జైలు అధికారి శశి చెల్లయ్య షో విజేతగా నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు