Man Dies Of Heart Attack : షాకింగ్ వీడియో.. బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే మృతి..!

మస్కట్ లో భారత సంతతికి చెందిన వ్యక్తి అనూహ్య రీతిలో చనిపోయాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి స్వస్థలం కేరళ అని తెలుస్తోంది. (Man Dies Of Heart Attack)

Man Dies Of Heart Attack : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు.

ఒకప్పుడు వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది. ఇప్పుడు, వయసుతో సంబంధం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు.. ఫిట్ గా ఉండి, జిమ్ చేస్తున్న వారు సైతం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read..Heart Attack : చలికాలంలో గుండె పోటు మరణాలు అధికమా! ఎందుకిలా ?

తాజాగా మస్కట్ లో భారత సంతతికి చెందిన వ్యక్తి అనూహ్య రీతిలో చనిపోయాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి స్వస్థలం కేరళ అని తెలుస్తోంది.

బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడాడు. యాక్టివ్ గా కనిపించాడు. ఫ్రెండ్స్ తో కలిసి గేమ్ ను ఎంజాయ్ చేశాడు. ఇంతలో సడెన్ గా కుప్పకూలిపోయాడు.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

అతడి ఫ్రెండ్స్ కి ఏం జరిగిందో అర్థం కాలేదు. కంగారుపడ్డారు. అతడి దగ్గరికి వచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు లేవలేదు. అయితే, గుండెపోటు వంటి పరిస్థితుల్లో సీపీఆర్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ చేయడం చాలా ముఖ్యం అని, అలా చేయడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని నిపుణులు అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఇండోర్ లో, యూపీ లక్నోలో ఇలాంటి ఘటనలే జరిగాయి. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయారు ఇద్దరు వ్యక్తులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇంతకు ముందు వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి మాత్రమే గుండెపోటు వస్తుందని నమ్మేవారు. అయితే గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. ఇది అవాస్తవమని తేల్చేశాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా గుండెపోటుతో సడెన్ గా మరణిస్తున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతదేశంలో దాదాపు 50 శాతం గుండెపోటు కేసులు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో.. 25 శాతం 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తున్నాయి.