Indian scientists: ఇదే తొలిసారి.. సుదూర గెలాక్సీ నుండి రేడియో సిగ్నల్ అందుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు

భూమికి తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుంచి పంపబడిన రేడియో సిగ్నల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలోని జెయింట్ మీటర్‌వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) చాలాదూరంలో ఉన్న గెలాక్సీ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను అందుకుంది.

Indian Scientists: భూమికి తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుంచి పంపబడిన రేడియో సిగ్నల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలోని జెయింట్ మీటర్‌వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) చాలాదూరంలో ఉన్న గెలాక్సీ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను అందుకుంది. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఇంతదూరం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. తొమ్మిది బిలయన్ల దూరం నుంచి సిగ్నల్స్ రావటం ఇదే తొలిసారి. ఈ సంకేతం నుండి మన విశ్వం ఎలా ఏర్పడి ఉంటుందో నిర్ధారించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి

ఈ సంకేతం యొక్క ప్రత్యేక ఏమిటంటే.. 21 సెంటీమీటర్ లైన్ లేదా హైడ్రోజన్ లైన్ అనిపిలువబడే ఒక ప్రత్యేకమైన తరంగధైర్ఘ్యం కలిగి ఉంటుంది. ఇది తటస్థ హైడ్రోజన్ అణువుల ద్వారా విడుదలవుతుందని నివేదించబడింది. కెనడాలోని మెక్ గిల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాష్త్రవేత్త ఆర్నాబ్ చక్రవర్తి మాట్లాడుతూ.. గెలాక్సీ వివిధ రకాల రేడియో సంకేతాలను విడుదల చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం భూమికి దగ్గరగా ఉన్న గెలాక్సీల నుంచి మాత్రమే సంకేతాలు అందుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మన ఖగోళ శాస్త్రవేత్తలు భూమి నుంచి సంకేతాలు అందుకున్న అత్యంత సుదూరమైన దూరం హైడ్రోజన్ సిగ్నల్ 21 సెంటీమీటర్లు, 440 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

Scientists Search 300 year Old wheats : 300 ఏళ్ల నాటి గోధుమలపై శాస్త్రవేత్తల పరిశోధనలు .. ఇక పురాతనకాలంనాటి ఆహారమే దిక్కు కాబోతోందా?

ఎన్సీఆర్ఏ ( నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్) సెంటర్ డైరెక్టర్ యశ్వంత్ గుప్తా ఈ అంశంపై మాట్లాడారు. సుదూర విశ్వం నుంచి వెలువడే తటస్థ హైడ్రోజన్‌ను గుర్తించడం చాలా సవాలుతో కూడుకున్న పని అన్నారు. ఈ ప్రయోగం జీఎంఆర్టీ యొక్క కీలకమైన ప్రయోగాల్లో ఒకటిగా ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతం అందిన సంకేతాలతో మేం సంతోషంగా ఉన్నామని, మా భవిష్యత్తు ప్రయోగాల్లో ఇది మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు