Lakshya Sen Win Gold Medal : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం..బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్యసేన్ విజయం సాధించారు. మలేషియాకు చెందిన షట్లర్ జే యంగ్ పై లక్ష్యసేన్ గెలుపొందారు.

Lakshya Sen win gold medal : కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా వెలిగిపోతోంది. భారత్ కు పతకాల పండుతోంది. భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుసగా స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకుంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్యసేన్ విజయం సాధించారు. మలేషియాకు చెందిన షట్లర్ జే యంగ్ పై లక్ష్యసేన్ గెలుపొందారు. జే యంగ్ పై 19-21, 21-9, 21-16 తేడాతో లక్ష్యసేన్ విక్టరీ సాధించారు. తొలి గేమ్ లో కాస్త వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్ చివరి రెండు గేమ్స్ లోనూ పట్టుదలగా ఆడారు.

PV Sindhu wins gold medal : కామన్వెల్త్‌ గేమ్స్‌లో పివి.సింధుకు స్వర్ణం..వరుసగా మూడోసారి మెడల్

ప్రత్యర్థి జే యంగ్ గట్టి పోటీ ఇచ్చినా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడి భారత్ కు మరో స్వర్ణం అందించారు. అంకముందు ఉమెన్స్ సింగిల్స్‌లో పివి.సింధు గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మొత్తం 57 పతకాలు లభించాయి. వీటిలో 20 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు