Indian Teen Missing In US
Indian Teen Missing In US: భారత సంతతికి చెందిన 14 ఏళ్ల ఓ అమెరికా అమ్మాయి మూడు వారాలుగా కనపడట్లేదు. ఆర్థిక మాంద్యం భయంతో ప్రస్తుతం అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో తన తండ్రి జాబ్ కూడా పోతుందని, అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే ఆ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్కాన్సాస్ రాష్ట్రంలోని నార్వే నగరంలో నివసించే తన్వి మరుపల్లి అనే బాలిక జనవరి 17న స్కూలు నుంచి ఇంటికి వెళ్లే బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ ఓ ప్రాంతానికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లిందో పోలీసులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల అమెరికాలో ఉండే అర్హత కోల్పోతామేమోనని తాన్వీ తల్లిదండ్రులు కూడా అంతకుముందు ఇంట్లో మాట్లాడుకునేవారు. దీంతో ఆ భయంతోనే తాన్వీ ఇల్లు వదిలి వెళ్లిందని ఆమె తల్లిదండ్రులు కూడా అనుమానిస్తున్నారు.
తాము అమెరికాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నామని, పౌరసత్వం కూడా వస్తుందని భావించామని, అయితే, అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నిబంధనల కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని తాన్వీ తండ్రి పవన్ రాయ్ మారుపల్లి చెప్పారు. ప్రస్తుతానికి తాను ఉద్యోగం కోల్పోయే స్థితిలో మాత్రం లేనని అధికారులకు పవన్ తెలిపారు. తాన్వీ తల్లి శ్రీదేవీ ఈదర గతంలో ఉద్యోగం కోల్పోయింది.
అనంతరం ఆమె ఒంటరిగా భారత్ కు వచ్చేసింది. మళ్ళీ అమెరికా వెళ్లడానికి వీసా సంపాదించి ఆ దేశానికి వెళ్లింది. ఒకవేళ వీసా కోల్పోతే ఏమవుతుందని ఇటీవల తాన్వీ తన తండ్రిని అడిగింది. దీంతో పవన్ తన కూతురిని భయపడొద్దని చెప్పారు. వీసా సమస్య ఎదురైతే మొదట తాన్వీని, శ్రీదేవీని భారత్ కు పంపుతానని చెప్పారు.
మళ్ళీ వీసా వచ్చాక వారిద్దరినీ అమెరికా రావాలని చెబుతానని అన్నారు. ఇంతలో తన కూతురు తాన్వీ కనపడకుండాపోయిందని పవన్ చెప్పారు. తన కూతురు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు.
Ram Prasad: జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్..? క్లారిటీ ఇచ్చిన కమెడియన్..!