27 అయస్కాంతాలను మింగేసిన 4 ఏళ్ల బాలుడు.. గొంతులో 2, కడుపులో 25..

  • Publish Date - November 16, 2020 / 07:40 AM IST

Indiana boy eating 27 magnets : ఇండియానాకు చెందిన నాలుగేళ్ల బాలుడు 27 అయస్కాంతాలను మింగేశాడు. మింగిన అయస్కాంతాలు గొంతులో ఇరుక్కోవడంతో పిల్లాడు ఊపిరాడక ఏడవడం మొదలుపెట్టాడు. గమనించిన తండ్రి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే బాలుడి గొంతులో రెండు అయస్కాంతాలు ఉన్నాయి. వైద్యులు ఎక్స్ రే ద్వారా బాలుడి గొంతు, కడుపులో మొత్తం 27 వరకు అయస్కాంతాలు ఉన్నాయని గుర్తించారు. రెండు గొంతులో ఇరుక్కోగా.. మిగిలిన 25 అయస్కాంతాలు కడుపులో నుంచి బయటకు తీశారు.



కుమారుడు ఎందుకు ఏడుస్తున్నాడో ఏమైందో అర్థంకాలేదు.. గొంతులో ఏదొ ఇరుక్కుందని భావించి వెంటనే ఎమర్జెన్సీ రూంకు తీసుకెళ్లారు. పిల్లాడు మ్యాగ్నెట్ బాల్స్ మింగినట్టు గుర్తించారు. మ్యాక్ నెయిర్ భార్య జస్సికా కుమారుడు పెయిటన్ నోరు తెరిచి చూసింది.

అతడి గొంతులో గోలీలు మాదిరిగా అయస్కాంతాలు ఉండటంతో షాక్ అయింది. గొంతు కిందిభాగంలో ఒకదాని పక్కన ఒకటి రెండు మ్యాగ్నెట్స్ ఇరుక్కున్నట్టు చూశానని చెప్పింది.



https://10tv.in/dont-eat-cold-meats-if-youre-pregnant-or-old-docs-warn/
అంతకుముందు తాను ఇంట్లో చిన్నపాటి గ్రుండంగా ఉన్న అయస్కాంత బాల్స్ చూశానని, ఇప్పుడు అవి కనిపించడం లేదని తెలిపింది. అంటే.. బాలుడు పెయిటన్ మింగేసి ఉండొచ్చునని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి గొంతులో రెండు అయస్కాంతాలు ఉన్నాయి.
తన కుమారుడికి జరిగిన అనుభవంతో ఇతర తల్లిదండ్రులకు నియోడైమియం మాగ్నేట్స్ ఎంత ప్రమాదకరమో అర్థమై ఉండాలని జస్సికా చెప్పుకొచ్చింది.



ప్రాణాంతకమైన మాగ్నేట్స్ విషయంలో చాలామంది పెద్దగా పట్టించుకోరని తెలిపింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉండాలని పేర్కొంది.

గత సెప్టెంబర్ నెలలో పెయిటెన్.. తన సోదరుడితో కలిసి అయస్కాంతాలతో ఆడుకున్నాడు. అయస్కాంత బాల్స్ అన్నింటిని అతికించి పాములా చేసి సరదాగా ఆడుకునేవాడని తండ్రి నెయిర్ తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు