Submarine Missing : సముద్ర గర్భాన్ని ఢీకొని..మునిగిపోయిన జలాంతర్గమి..53 మంది సిబ్బంది మృతి

Indonesia Submarine Missing : ఇండోనేషియాకు చెందిన ఓ జలాంతర్గామి (Submarine)బాలిలో సముద్ర గర్భంలో మునిగిపోయింది. దీంతో ఆ జలాంతర్గామిలో ఉన్న సిబ్బంది మొత్తం 53మంది జలసమాధి అయిపోయారు. నేలను ఢీకొట్టటంతో KRI Nanggala 402 జలాంతర్గామి ఈ ప్రమాదానికి గురైనట్లుగా తేలింది. ప్రమాదానికి గురైన జలాంతర్గామి శకలాలను గుర్తించామని మిలటరీ అధికారులు తెలిపారు.



జలాంతర్గామిలో ఉన్న 53 మంది సిబ్బంది మృతి చెందారని తెలిపింది. మునిగిపోయిన ‘కేఆర్ఐ నంగాలా 402’ మూడు ముక్కలైందని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మర్గోనో తెలిపారు. అందులో ఉన్న 53 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇండోనేషియా మిలటరీ హెడ్ హాదీ జయంతో తెలిపారు.



ఆదివారం (ఏప్రిల్ 15,2021) ఉదయం సముద్ర మట్టానికి 800 మీటర్లు (2,600 అడుగులు) లోతు నుంచి సిగ్నల్స్ అందుకున్నామని..దీంతో వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించామని ఓ అధికారి తెలిపారు. వెంటనే సహాయక కార్యక్రమాలు ప్రారంభించినా సిబ్బందిని కాపాడలేకపోయామని తెలిపారు. దీనికి సంబంధించి పలు శకలాలను గుర్తించామని తెలిపారు. ఇందులో లంగరు, సిబ్బంది ధరించిన సేఫ్టీ సూట్స్ ఉన్నట్టు జయంతో వెల్లడించారు.


ట్రెండింగ్ వార్తలు