Islamic Boarding School Teacher Raped 13 Girl Students
Islamic Boarding School teacher raped 13 Girl students : మాస్టారు అంటే విద్యాబుద్ధులు చెప్పే గురువే కాదు తండ్రితో సమానం. అటువంటి మాస్టారు కామాంధుడిగా మారితే..ఇక ఆడబిడ్డల పరిస్థితి ఏంటీ?వారికి రక్షణ ఎక్కడ? తన కళ్లముందు కనిపించే బాలికల్లో కన్నబిడ్డను చూసుకోకుండా కామాంధుడిగా మారిన ఓ మాస్టారు ఒకరు ఇద్దరుకాదు ఏకంగా 13మంది బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 36 ఏళ్లకే 13 మంది బాలికలను అత్యాచారం చేసిన ఆ కామాంధ మాస్టారికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన ఘటన ఇండోనేషియాలో జరిగింది.
ఇండోనేషియాలో హెర్రీ విరావాన్ అనే 36 ఏళ్ల యువకుడు స్కూల్ నడుపుతున్నాడు. స్కాలర్ షిప్ ఇస్తానని..చదువు చెబుతానని నమ్మించి ఆడపిల్లలను చేర్చుకుని వారికి వసతి కూడా ఏర్పాటు చేసాడు. బాలికను తల్లిదండ్రులకు దూరంగా ఉండేవారు.దాన్నే ఆసరా చేసుకున్న హెర్రీ చదువుకోసం వచ్చిన బాలికపై అతని కామపు కళ్లు పడ్డాయి. అలా 36 ఏళ్ల హెర్రీ విరావాన్ 13 మంది బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ ఆరోపణలతో జైలుపాలయ్యాడు.దీనికి సంబంధిచిన కేసును మంగళవారం (పిబ్రవరి 15,2022) వెస్ట్ జావాలోని బండుంగ్ జిల్లా కోర్టు విచారించి తీర్పును వెలువరించింది. తన స్కూల్లో చదువుతున్న 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను విరావాన్ అత్యాచారం చేశాడు.
ఇస్లామిక్ మత గురువుగా ఉన్న హెర్రీ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ నడుపుతున్నాడు. తన స్కూల్‌కు వచ్చే బాలికలపై 2016 నుంచి ఘోరానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన 8 మంది గర్భం దాల్చారు. బిడ్డలకు జన్మనిచ్చారు. వాస్తవానికి విరావాన్‌కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. బాధిత కుటుంబాలు కామాంధ టీచర్ హెర్రీని రసాయనాలతో వృషణాలను నిర్వీర్యం చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ కోర్టు ఆ డిమాండ్లను తిరస్కరించింది. స్కాలర్‌షిప్‌లు ఇస్తామంటూ ఆ టీచర్ అమ్మాయిలను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బాధితురాలికి ఇండోనేషియా ప్రభుత్వం ఆరువేల డాలర్లు చెల్లించనున్నది.