Indonesia landslides kill 15 and morethen 50 missling..
Indonesia : ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15మంది ప్రాణాలు కోల్పోగా మరో 45మంది గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ విపత్తు సంభవించిన ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు సమాచార సంబంధాలు తెగిపోయాయి.
దాంతో అక్కడ రక్షణ, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినా అందరు శ్రమిస్తున్నారు. సముద్ర మార్గం గుండా ఆ ప్రాంతానికి చేరుకోవటానికి గంటలకొ్దీ సమయంలో పడటంతో సహాయక చర్యలకు ఆలస్యం కలుగుతోంది. దీంతో రెస్క్యూ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా విపత్తు ప్రదేశానికి తరలిస్తున్నారు అధికారులు.
ఈ ప్రకృతి విపత్తుకు బోర్నియోలోని బంజర్ జిల్లాలో 7 వేల ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతం అంతా బురద పేరుకుపోయింది. రెస్క్యూ టీమ్ కొండచరియల కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. ఎనిమిదిమందిని ప్రాణాలతో కాపాడగా వారిలో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. బాధితులకు వైద్య సహాయం అందించటం కూడా కష్టంగా మారింది. బాధితులను అక్కడకి 285 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ద్వీపంలోని పోంటియానాక్ నగరంలోని ఆస్పత్రికి తరించారు.
కొండచరియలు విరిగిపడటంతో వేలాది ఇళ్లు ధ్వంసం కావటంతో 1200లమందికిపైగా నిరాశ్రయులయ్యారు.వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ విపత్తు నిర్వహణ ప్రతినిథి అబ్దుల్ ముహారి మాట్లాడుతూ..ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయి ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నామని తెలిపారు.