Indonesia Mount Semeru
Volcano Erupted: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మౌంట్ సమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఆదివారం ఉదయం అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. దీనినుంచి ప్రమాదకర స్థాయిలో లావా ఎగజిమ్ముతుంది. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. స్థానికుల్లో ఎవరికీ గాయాలు కాలేదు.
Indonesia Mount Semeru
అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతం నుండి దాదాపు 2వేల మందిని అధికారులు ఖాళీ చేయించారు. లావా ఎగజిమ్ముతుండటంతో కనీసం 8 కి.మీ (5 మైళ్ళు) దూరంలో ఉండాలని స్థానిక అధికారులు ప్రజలకు సూచించారు.
Indonesia Mount Semeru
ఇండోనేషియాలోని అగ్నిపర్వత, జియోలాజికల్ ప్రమాదాల నివారణ కేంద్రం (PVMBG) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అగ్నిపర్వతం విస్పోటనం తీవ్రత భారీగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల కిలో మీటరున్నర మేర బూడిద గాలిలోకి ఎగిసి చుట్టుపక్కల గ్రామాలను కప్పేస్తుంది. ఈ అగ్నిపర్వతం విస్పోటనం దాటికి సుమారు ఆరు గ్రామాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు.
Indonesia Mount Semeru
మరోవైపు గత వారంరోజులుగా హవాయి దీవిలోని మౌనాలోవా నుంచి తీవ్రంగా వాల్కనో విరజిమ్ముతుంది. పరిసర ప్రాంతాలన్నీ లావా బూడిదతో నిండిపోయాయి.
Indonesia Mount Semeru
లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల వేగంతో ఈశాన్యం దిశలో ముందుకు సాగుతున్నదని హవాయి అధికారులు తెలిపారు. అయితే , 1984 తర్వాత మౌనాలోవా నుంచి పెద్దఎత్తున లావా వెలువడటం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే సెమెరు అగ్నిపర్వతం విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ హెచ్చరించింది.
Mohon Doanya semua untuk Lumajang, Erupsi Semeru sedang berlangsung. Di rumahku, seperti mendung mau hujan. pic.twitter.com/UBaHlDLkTT
— NineInspire (@AnggraNing) December 4, 2022