Indonesia : పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా..ఇకనైనా ధరలు దిగివచ్చేనా?

పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇండోనేషియా శుభవార్త చెప్పింది. నెల రోజుల క్రితం పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది. దీంతో వంటనూనెల ధరలు దిగి వస్తాయని సామాన్యులు ఆశపడుతున్నారు.

Indonesia to lift palm oil export ban  : పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇండోనేషియా శుభవార్త చెప్పింది. నెల రోజుల క్రితం పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం గురువారం (మే 19,2022) తెలిపింది. దీంతో వంటనూనెల ధరలు దిగి వస్తాయని సామాన్యులు ఆశపడుతున్నారు. ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణక్ష్ం మే 23 నుంచే అమల్లోకి రానుంది అని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ వెల్లడించారు. పామాయిల్ ఎగుమతులు మళ్లీ జోరందుకుంటే ఆయిల్ ధరలు క్రమంగా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

Also read : Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియాల నుంచే 85 శాతం వస్తోంది. ఈక్రమంలో తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతోపాటు ధరలకు ముకుతాడు వేసేందుకు ఇండోనేషియా తమ దేశం నుంచి ఎగుమతులను నిషేధించింది. దీంతో ఆ దేశం నుంచి అధికంగా నూనెను దిగుమతి చేసుకునే భారత్‌లో ఒక్కసారిగా ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ధరకు చేరుకుని ఇబ్బందులకు గురిచేశాయి. ఇప్పుడు ఇండోనేషియా తిరిగి ఎగుమతులకు అనుమతులివ్వడంతో నూనె ధరలు మళ్లీ దిగి వచ్చే అవకాశం ఉంది. కాగా భారత్ లో  అన్ని రకాల వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి.దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు