Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ బాస్కర్ బాబు కారులో యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీలే సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని..అతనే చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ సుబ్రహ్మణ్యం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్యసీ అనంతబాబు చెప్పుకొస్తున్నారు. దీంతో కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Andhra pradesh Crime : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ బాస్కర్ బాబు కారులో యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీలే సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని..అతనే చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ సుబ్రహ్మణ్యం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్యసీ అనంతబాబు చెప్పుకొస్తున్నారు. దీంతో కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గురువారం (మే 19,2022) అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా అతని అనుచరులు పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఐతే మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్లగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు వద్ద డ్రైవ్ గా పనిచేశాడు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ అనుచరులు సుబ్రమహ్మణ్యంను తీసుకెళ్లారని.. వాళ్లే తమ కొడుకును హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రాత్రి పదిన్నర సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని.. ఒంటిగంట సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతబాబును సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుండగా.. ఎమ్మెల్సీనే కొట్టిచంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావడంతో అనుచరులంతా పార్టీ చేసుకున్న క్రమంలో ఆ పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా.. లేక మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో పనిచేసిన డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీనే వచ్చి తీసుకెళ్లి.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడని… అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. పార్టీలో భోజనం లేక టిఫిన్ కోసం బయటకు వెళ్లాడని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
కాగా సుబ్రహ్మణ్యం బట్టలకు మట్టి ఉందని నీరు కారుతోందని..కాళ్లు చేతులు విరిచేసిన ఆనవాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబే అతనికి కొట్టి చంపి ఉంటారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతను ఏమీ చేయకపోతే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించవద్దు అని ఎందుకు చెబుతారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
కానీ ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని..మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించవద్దని అన్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఆరు నెలల క్రితం అనంతబాబు దగ్గర ఉద్యోగం మానేశాడు. ఐతే గతంలో ఎమ్మెల్సీ వద్ద కొంత డబ్బు తీసుకున్నారని.. ఆ డబ్బు కోసం తరచూ ఫోన్ చేస్తుండేవారని కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కానీ అధికారి పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కాబట్టి సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయంలో అసలు వాస్తవాలను దాచి పెట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసును మాఫీ చేస్తారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కూడా అదే భావిస్తున్నట్లుగా సమాచారం.
కాగా మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనతో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
- Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..
- Casino: క్యాసినోకు ఏర్పాట్లు.. పోలీసుల అనుమతి నిరాకరణ
- Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
- Vallabhaneni Vamsi: తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. పంజాబ్‌లోని ఆస్పత్రిలో చికిత్స..
- Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ
1Thankyou : డేట్ మార్చుకున్న చైతూ.. నిఖిల్‌కి పోటీగా..
2Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
3Kartik Aryan : చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి హిట్ ఇచ్చినందుకు.. హీరోకి 5 కోట్ల కార్ ఇచ్చిన నిర్మాత
4Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!
5VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..
6Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా
7Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..
8Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..
9Kartihkeya 2 : ఈ సారి కృష్ణుడి కోసం.. ద్వారకా నగరం ఏమైంది??.. అదరగొట్టిన కార్తికేయ 2 ట్రైలర్..
10Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?