ట్విస్టుల మ్యారేజ్ : 78 ఏళ్ల ముసలాడితో 17 ఏళ్ల బాలిక పెళ్లి… నెలలోపే విడాకులు..!

  • Published By: Chandu 10tv ,Published On : November 5, 2020 / 04:22 PM IST
ట్విస్టుల మ్యారేజ్ : 78 ఏళ్ల ముసలాడితో 17 ఏళ్ల బాలిక పెళ్లి… నెలలోపే విడాకులు..!

Updated On : November 5, 2020 / 4:51 PM IST

Indonesian man married 17 years girl: పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ అందరికీ తెలుసు కదా…ఇది కథే అయినా సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టే కథ. ఒక బాలికను ఓ పండు ముసలాడికిచ్చి పెళ్లి చేస్తారు. కానీ కొంతకాలానికే చిన్నారి వృద్ధ భర్త చనిపోతాడు. దీంతో ఆమె వితంతువుగా మారుతుంది. అలాంటిదే ఇండోనేషియాలో ఓ వృద్ధుడు తన మనమరాలు వయసున్న బాలికని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే వృద్ధుడ్ని పెళ్లిచేసుకున్న బాలిక తన సొంత ఇష్టంతోనే పెళ్లిచేసుకోవటం..!

ప్రేమకు వయస్సుతో పనిలేదని మరోసారి నిరూపించారు ఈ వృద్ధుడు..బాలిక. లేటు వయస్సులో బాలికతో తాత ప్రేమలో పడితే..విచిత్రంగా తాత వయస్సులోఉన్న వ్యక్తితో ఆ బాలిక ప్రేమలో పడటం..వీరి మనసులు కలవడంతో పెద్దలు వీరిద్దరిని పెళ్లితో ఒకటి చేశారు. కానీ పెళ్లైయ్యే నెలరోజు తిరక్కముందే విడాకులు ఇచ్చాడా ముసలిభర్త. వీరి పెళ్లే ఓ చిత్రమైతే వీరి విడాకులు అంతకన్నా చిత్రంగా మారిన..వీరి ప్రేమ పెళ్లిలో వచ్చిన ట్విస్టుకి కారణమేంటో తెలుసుకుందాం..ఈ విచిత్ర పెళ్లిలో ట్విస్టులే ట్విస్టులు.

Abah Sarna Noni Navita



వివరాల్లోకి వెళ్తే… ఇండోనేషియా కు చెందిన 78 ఏళ్ల వ్యక్తి అబా సర్ణాకు కొద్దిరోజుల క్రితమే నోని నవిత అనే 17 బాలిక పెళ్లి కుదిరింది. రెండువైపుల వాళ్లు మాట్లాడుకుని బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. కానీ ఏమైందో ఏమో గానీ… అబా సర్ణా(78), నోనికి విడాకులిస్తానని చెప్పాడు. అనుకున్నదే తడువుగా పెద్దలందరిని పిలిపించి వారి సమక్షంలోనే 22 రోజులకే ఆమెకు విడాకులు ఇచ్చాడు సర్ణా.

Abah Sarna Noni Navita



అసలు ఏం జరిగిందంటే..నోని పెళ్లి చేసుకోవటం అబాకు మాత్రమే ఇష్టం. వాళ్ల ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. కానీ వాళ్లందరిని కాదని ఆమెని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో వాళ్లెవరూ ఆయనతో మాట్లాడలేదట. అంతేకాక నోని పెళ్లికి ముందే గర్భవతి అయిందని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు నోనిని వారి ఇంటి మనిషిగా అంగీకరించలేదు.

పెళ్లి సందర్భంగా పడుచు పెళ్లాం నోనికి ముసలి భర్త ఇచ్చిన  రూ.50వేల విలువైన వస్తువులను ఇచ్చాడు. మోటార్ సైకిల్, మంచం..పరుపు వంటి ఇతర సామగ్రీని విడాకులైన వెంటనే తీసుకెళ్లిపోయాడు. ఈ విచిత్ర పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.