Infosys Narayana Murthy-Rushi Sunak : రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉంది : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి పాలనను అందిస్తారని విశ్వసిస్తున్నానని అన్నారు నారాయణమూర్తి.

Infosys Narayana Murthy-Rushi Sunak : భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. భారతీయులను 200ఏళ్లపాటు పాలించిన బ్రిటీష్ వారికే ప్రధాని అయ్యారు రిషిసునక్. భారతీయుడైన రిషి సునక్ మరెవరో కాదుఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి స్వయానా అల్లుడే. నారాయణమూర్తి కుమార్తె లక్షతామూర్తి భర్త రిషి సునక్. అలా మన భారతీయుడు..మన నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ ప్రధాని అయ్యారు.

బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నవేళ తన అల్లుడు నారాయణ మూర్తి బ్రిటన్ ప్రధాని అయిన సందర్భంపై నారాయణ మూర్తి ఆయన భార్య సుధా మూర్తి ఆనందంలో తేలిపోతున్నారు. వారే కాదు యావత్ భారతం అంతా మనవాడు బ్రిటన్ ప్రధాని అయ్యాడని మురిసిపోతున్నారు. మనకే ఇలా ఉంటే ఇక పిల్లనిచ్చిన మామకు ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత గర్వంగా ఉంటుందో కదా..ఈ శుభపరిణామంపై చరిత్ర సృష్టించిన రిషి సునాక్ నా అల్లుడని చెప్పుకోవటానికి గర్వపడుతున్నానని తెలిపారు నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి.

నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తి భర్తే రిషి సునాక్. స్టాన్ ఫోర్డ్ యూనివర్మిటీలో ఎంబీఏ చదివేటప్పుడు వీరిద్దరికీ అయిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలిశాయి. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ రిషిని ప్రేమించాను డాడీ అని కుమార్తె చెప్పినప్పుడు నారాయణమూర్తి పెద్దగా ఆసక్తి చూపించలేదట. కానీ  కానీ ఒకేఒక్కసారి మామా అల్లుళ్లు అయిన మొదటి మీట్ లోనే రిషి నారాయణమూర్తిగారి మనస్సును గెలుచేసుకున్నారట. అలా మా అల్లుడు బంగారం అనేలా చేసేకున్నారట రిషి. అలా ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. అలా ఆ రిషియే బ్రిటన్ ప్రధాని అవుతారని బహుశా నారాయణమూర్తి కూడా అనికుని ఉండరేమో. కానీ ఊహించని అద్భుతాలు జరగటమే జీవితం అంటే. అదే జరిగింది రిషి సునక్ ప్రతభకు దక్కిన బ్రిటన్ ప్రధాని పదవి.

తన అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై నారాయణమూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రుషికి శుభాకాంక్షలు తెలిపారు. రిషి పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి పాలనను అందిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు