Village That's Shaped Like A Person (1)
village that’s shaped like a person : అదొక గ్రామం. ఆ గ్రామాన్ని పైనుంచి చూస్తే అచ్చు మనిషి ఆకారంలో ఉంటుంది. అదేంటీ ఊరేంటి మనిషి ఆకారంలో ఉండటమేంటి? అనుకుంటున్నారా? ఆ ఆకారమే ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిచేలా చేసింది. ఓ ఫోటో గ్రాఫర్ ద్వారా ఆ గ్రామం అచ్చు మనిషి ఆకారంలా ఉంటుందని తెలిసింది. మనుషులుండే ఊళ్లుంటాయి. కానీ అచ్చం మనిషి ఆకారంలా ఉండే ఊరు అంటే కాస్త విచిత్రమే..ఆ వింత షేపులో ఉండే ఊరు పేరు ‘సెంటూరిపే’. ఇది ఇటలీలోని సిసిలీ ద్వీపంలోని చిన్న పట్టణం.
Glass pyramid..Gunnison record : 54,740 గాజు గ్లాసులతో పిరమిడ్..గిన్నీస్ బుక్ రికార్డ్
5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామాన్ని పై నుంచి చూస్తే అచ్చంగా మనిషిలాగే ఉంటుంది. ఓ ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్‌లో తమ పట్టణం మ్యాప్‌ను చూసి ఆశ్చర్యపోయారు. అచ్చం మనిషి బొమ్మలా ఉందే అని అనుకున్నారు. డౌట్ వస్తే దాన్ని క్లియర్ చేసుకోనిదే నిద్రపోని ఆ ఫోటో గ్రాఫర్ డ్రోన్ సాయంతో పలు ఫోటోలు తీయగా వావ్..అంటూ ఆశ్చర్యపోయారు. సంబరపడిపోయారు. డ్రోన్ ను వీలైనంత ఎత్తులో ఎగరేసి ఆ ఫోటోలు తీశారు పియో ఆండ్రియా.
Assembly Elections : వచ్చే వారమే..5 రాష్ట్రాల ఎన్నికల తేదీలపై ఈసీ ప్రకటన!
ఇంటర్నెట్లో పోస్ట్ చేయగా..అది క్రియేట్ చేసిన ఫోటో అన్నారు చాలామంది. మార్ఫింగ్ చేశారని.. పియో ఆండ్రియాను విమర్శించారు. కానీ తనేమీ క్రియేట్ చేయలేదని కావాలంటే గూగుల్ లో చెక్ చేసుకోవచ్చని అనేసరికి చాలామంది గూగుల్‌లో మ్యాప్‌లో చెక్ చేసి చూడగా నిజమేనని తేలింది. దీంతో సదరు ఫోటో గ్రాఫర్ కు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా తెలిపారు.