Glass pyramid..Gunnison record : 54,740 గాజు గ్లాసులతో పిరమిడ్‌..గిన్నీస్‌ బుక్‌ రికార్డ్

దుబాయ్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ న్యూఇయర్‌ వేడుకలతో పాటు గిన్నీస్‌ వరల్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.54,740 గాజుగ్లాసులతో పిరమిడ్‌..గిన్నీస్‌ బుక్‌ రికార్డ్ క్రియేట్ చేసింది.

Glass pyramid..Gunnison record : 54,740 గాజు గ్లాసులతో పిరమిడ్‌..గిన్నీస్‌ బుక్‌ రికార్డ్

Glass Pyramid..guinness World Record

Glass pyramid..Guinness world record: దుబాయ్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ న్యూఇయర్‌ వేడుకలతో పాటు గిన్నీస్‌ వరల్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. గాజుగ్లాసులతో పిరమిడ్ నిర్మించి రికార్డు కొట్టేసింది. వందా కాదు 1000 కాదు ఏకంగా 54వేల 740 గాజు గ్లాసులను 8.23 మీటర్ల ఎత్తులో పిరమిడ్ లా నిర్మించింది. నాలుగేళ్ల క్రితం ఈ హోటలే గాజుగ్లాసుల పిరమిడ్ ను నిర్మించి నెలకిల్పిన రికార్డును బ్రేక్ చేసి మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Read more :Longest Ears Dog : పెద్ద పెద్ద చెవులతో కుక్క గిన్నిస్ బుక్ రికార్డ్ 

ఈ స్టార్‌ హోటల్‌లో అట్లాంటిస్, ది పామ్‌ అనే ఈవెంట్ ఆర్గనైజేషన్‌ చేపట్టిన గ్లాస్‌ పిరమిడ్ నిర్మాణంలో మోయట్, చాండన్‌ అనే సోదరులు ఈ పిరమిడ్ ను రూపొందించారు. డిసెంబర్ 30 తేదిన న్యూఇయర్‌కి స్వాగతం పలుకుతూ హోటల్‌కి చెందిన రిసార్ట్‌లోని అసటీర్‌ టెంట్‌లో ఈ విధంగా గాజు గ్లాసుల్ని అందంగా గోపురంగా ఒకదానిపై మరొకటి నిలబెట్టి అందర్ని ఆకట్టుకున్నారు. అయితే దుబాయ్‌లోని అట్లాంటిస్, ది పామ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కోసం1548సూట్‌ రూమ్స్‌ సిద్ధం చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లు పార్టీతో పాటు గిన్నీస్‌ వరల్డ్ రికార్డు కోసం చేసిన ఈప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

Read more : World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

2017లో మాడ్రిడ్‌లో కూడా ఇటువంటి రికార్డే సృష్టించారు. 2017లో చేసిన రికార్డులో 50వేల 116 గ్లాసులతో పిరమిడ్ నిర్మించగా..ఆ రికార్డును ఇప్పుడు దుబాయ్‌లోని స్టార్ హోటల్‌ బ్రేక్ చేసింది.ఈ గ్లాస్ పిరమిడ్ తో గిన్నీస్‌ వరల్డ్ రికార్డులకు ఎక్కాలని చేసిన యత్నం సఫలమైంది. 54,740 గాజుగ్లాసులతో పిరమిడ్‌ని ఎలా నిర్మించారు?అనేదానిపై గిన్నీ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించారు. రికార్డుని ఓకే చేశారు.

Read more : 107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు