107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవల అక్కాచెల్లెళ్లకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.

10TV Telugu News

107 years twin sisters : వాళ్లు..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వారు వయస్సులో కూడా సెంచరీ కూడా దాటేసి 107 ఏళ్లకు చేరుకున్నారు. జపాన్ కు చెందిన వీరిద్దరి పేర్లు ఉమెనో సుమియామా, కోమే కొడామా. ఈరోజుల్లో 90 ఏళ్లు జీవించటమే అరుదు. అటువంటి ఈ కవల అక్కాచెల్లెళ్లు సెంచరీ దాటేసిందుకు..వీరు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు కావటంతో వీరికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.

ప్రస్తుతం ఈ కవల అక్కాచెల్లెళ్ల వయసు 107 సంవత్సరాల 330 రోజులు. ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరించినట్లుగా అధికారిక పేపర్స్ కూడా అందాయి. వీరిద్దరినీ అత్యంత వృద్ధ కవలలు విభాగంలో (మహిళలు) ఈ అవార్డు వరించింది.

Read more: Twin elephants: కవల ఏనుగుల జననం.. 80ఏళ్లలో తొలిసారి ఇలా

1913 నవంబరులో జపాన్ లోని కగావా ఫ్రిఫెక్చర్ లోని షాడో దీవిలో ఉమెనో సుమియామా, కోమే కొడామా అనే ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ జన్మించారు. ఈ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా.. వీరిలో ఈ అక్కాచెల్లెళ్లు వారి తల్లికి మూడో కాన్పులో జన్మించారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది.

Read more: కవలల్ని పెళ్లాడిన కవలలు ఒకేసారి గర్భవతులయ్యారు..కవలలే పుట్టాలని కలలు

కాగా ఈ కలల అక్కచెల్లెళ్లు ఇద్దరు చూడటానికి ఒకే రూపంలో ఉన్నా మనస్తత్వంలో మాత్రం ఇద్దరు భిన్నంగా ఉంటారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమేనో ఏపనిలో అయనా దృఢ సంకల్పంతో ఉంటారని..అదే కోమే మాత్రం చాలా సున్నిత మనస్కురాలని తెలిపారు.

జంటగా పుట్టినా వీరిద్దరు ఒకేచోట పెరగలేదు. స్కూల్ చదివేరోజుల్లో కౌమే తన మామకు సహాయం చేయటానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పుట్టిన ప్రాంతాన్ని వదిలి తోబుట్టువులకు దూరంగా పెరిగారు.అలాగే వివాహం విషయంలో కూడా ఉమెనో షాడో ద్వీపానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోగా కౌమే మాత్రం మరో ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఈ కవల అక్కచెల్లెళ్లు ఇద్దరు రెండు ప్రపంచ యుద్ధాల్ని చూశారు. ఇద్దరు 300 కి.మీ దూరంలో ఉండేవారు. దీంతో వారు కలుసుకోవటం కూడా చాలా తక్కువగా జరిగేది. బంధువుల పెళ్లిళ్లు, అంత్యక్రియల సమయాల్లో మాత్రమే కలుసుకునేవారు. ఒకరినొకరు చూసుకునేవారు. కానీ వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇద్దరు కలిసి సమయం గడపాలని అనుకున్నారు. అలా వారిద్దరు బౌద్ధ తీర్థయాత్రల కలిసి ప్రయాణించారు.

Read more : Delivered Twins:ప్రసవించిన ట్విన్స్..అక్కకు నలుగురు..చెల్లికి ముగ్గురు

వీరు ప్రపచంలోనే అత్యంత కవల పిల్లలుగా రికార్డు వచ్చిన సందర్భంగా మాట్లాడుతు..ఈ రికార్డు మేం ఊహించలేదు..కానీ ఈ రికార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఉమెనో, కౌమే ఇద్దరూ ఇప్పుడు వివిధ సంరక్షణ గృహాలలో నివసిస్తున్నారు.

పైగా..COVID-19 కారణంగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి అధికారిక ధృవపత్రాలను అందజేయడానికి కవలలను వ్యక్తిగతంగా కలవలేకపోయింది. కానీరికార్డు పత్రాలు మాత్రం ఇద్దరికి పంపించారు. ఈ సర్టిఫికేట్ చూసిన వెంటనే ఉమెనో కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే తోటి సోదరి అయిన కౌమేకు ఇప్పుడు జ్ఞాపకశక్తి సరిగా లేదు. ఈ అరుదైన రికార్డు పొందిన ఆనందాన్ని కూడా ఆమె ఆస్వాదించలేదని సోదరి వాపోయింది.

ఏది ఏమైనా..తమ సోదరీమణులకు గిన్నీస్ రికార్డు రావటం పట్ల వారి కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురించి తరచుగా మాట్లాడుకుంటుంటారు సంతోషంగా..