Longest Ears Dog : పెద్ద పెద్ద చెవులతో కుక్క గిన్నిస్ బుక్ రికార్డ్

ఓ కుక్క తన పొడవాటి చెవులతో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించింది.13.38 ఇంచుల పొడ‌వు చెవులతో రికార్డు క్రియేట్ చేసింది.

Longest Ears Dog : పెద్ద పెద్ద చెవులతో కుక్క గిన్నిస్ బుక్ రికార్డ్

Longest Ears Dog

World Longest Ears Dog : ప్రపంచంలో అతి పెద్దవి..అతి చిన్నవి,వింతలు విశేషాలు ఇలా గిన్నిస్ రికార్డు సాధిస్తుంటాయి. గిన్నీస్ రికార్డు కోసం ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ ఓ కుక్క మాత్రం ఏమాత్రం కష్టపడకుండా తన పొడవాటి చెవులతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఆ కుక్క పేరు ‘లౌ’. దాని వయస్సు మూడేళ్లు.

అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన ఓ మ‌హిళ పెంచుకుంటున్న న‌ల్ల‌ని వేట‌కుక్క చెవులు చూస్తే వామ్మో ఎంత పొడవున్నాయో అని షాక్ అవుతాం. అవి ఎంత పొడ‌వంటే ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకునేంత‌ పొడుగ్గా ఉన్నాయి. న‌లుపు, క‌మిలిన వ‌ర్ణాల క‌ల‌యికగా ఉన్న ఈ కుక్క చెవులు 13.38 ఇంచుల పొడ‌వు అంటే 34 సెంటీమీట‌ర్లు పొడుగున్నాయి.

Read more : 107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన వెట‌ర్న‌రీ టెక్నీషియ‌న్ పైగ్‌ ఓల్సెన్ అనే మ‌హిళ‌ ద‌గ్గ‌ర ఈ పొడవు చెవుల వేట‌కుక్క‌ ఉంది. మూడేండ్ల వ‌య‌సున్న ఈ కుక్క‌ను పైగ్‌ ఓల్సెన్ దాన్ని ముద్దుగా లౌ అని పిలుచుకుంటుంది. ఇటీవ‌ల క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓల్సెన్ త‌న కుక్క పొడ‌వైన‌ చెవుల‌ను కొలిచి ఆశ్చ‌ర్య‌పోయింది.సాధ‌ర‌ణంగా న‌లుపు, క‌మిలిన రంగుల మిక్సిడ్ గా ఉండే అన్ని వేట‌కుక్క‌ల చెవులు పొడ‌వుగా, అందంగా ఉంటాయ‌ని.. అయితే వాటిలోనే కొన్ని కుక్క‌ల చెవులు మాత్రం అసాధార‌ణంగా ఇంకా ఎక్కువ పొడ‌వు ఉంటాయ‌ని ఓల్సెన్ చెబుతోంది.

‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020’లో 80మంది భారతీయులు 

మా లౌ చెవులు దాని ముక్కు చివ‌రి వ‌ర‌కు ఉంటాయ‌ని పైగ్‌ ఓల్సెన్ నవ్వుతు చెబుతోంది. మా లౌ కి చెవులు ఇంత పొడుగు ఉన్నా ఎప్పుడు దానికి ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాలేద‌ని తెలిపింది. పైగా పొడ‌వు చెవుల కార‌ణంగానే అది డాగ్ కాంపిటీష‌న్స్‌లో, డాగ్ షోల‌లో పాపుల‌ర్ అయ్యింద‌ని చెప్పింది. అంతేగాక అమెరిక‌న్ కెన్నెల్ క్ల‌బ్‌, ర్యాలీ ఒబీడియెన్స్‌లో టైటిళ్ల‌ను కూడా నెగ్గింద‌ని ఓల్సెన్ తెలిపింది.

Read more: కవలల్ని పెళ్లాడిన కవలలు ఒకేసారి గర్భవతులయ్యారు..కవలలే పుట్టాలని కలలు

మా కుక్క చెవుల‌ను చూస్తే ఎవ‌రికైనా ట‌చ్ చేసి ఎంత పొడుగున్నాయో అని అనకుండా ఉండరని తన లౌని చూస్తు మురిపెంగా చెబుతోంది ఓల్సెన్. త‌న స్నేహితుల‌తో క‌లిసి వైన్‌యార్డుల‌కు వెళ్లిన‌ప్పుడు వైన్‌ను టేస్ట్ చేయ‌డంలో లౌ కంపెనీ కూడా ఇస్తుంద‌ని గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్లో ఓల్సెన్ వెల్లడించింది. లౌ లోని ప్ర‌త్యేక ల‌క్ష‌ణ‌మే ఇప్పుడు దానికి గిన్నెస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ బుక్‌లో 2022 చోటుద‌క్కేలా చేసింద‌ని తెలిపింది.