‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020’లో 80మంది భారతీయులు 

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 07:19 AM IST
‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020’లో 80మంది భారతీయులు 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎంతోమంది కలలు కంటారు. ఎంతోమంది ఆ కలను సాకారం చేసుకున్నారు. ఈ రికార్డు సాధించినవారిలో భారతీయులు ఎంతోమంది ఉన్నారు.ఈ క్రమంలో ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020’లో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 80 మంది భారతీయులకు చోటు దక్కింది. కొత్త రికార్డులు, సరికొత్త ప్రత్యేక కేటగిరీలు కలిగిన తాజా గిన్నిస్‌ పుస్తకాన్ని విడుదల చేసింది. పెంగ్విన్‌ రాండ్‌సమ్‌ హౌస్‌ ప్రచురణ సంస్థ గురువారం (అక్టోబర్ 31)న తెలిపింది. దీంట్లో భారతీయులకు సంబంధించి 80 అంశాలు ఉన్నట్లు తెలిపింది.

‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020’లో చోటు దక్కించుకున్న కొంతమంది 
-ప్రపంచంలోనే పొడవైన కురులు (వెంట్రుకలు) ఉన్న యువతిగా నీలాన్షి పటేల్‌ అనే 16 సంవత్సరాల అమ్మాయి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. నీలాన్షి పటేల్  జుట్టు పొడవు 5.7 అడుగులు. 
-నాగపూర్‌కు చెందిన జ్యోతి అమాజి ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా (24.7 అంగుళాలు) రికార్డుకెక్కారు.  -పొడవైన చేతివేలి గోర్లు (909.6 సెం.మీ) కలిగిన వ్యక్తిగా పుణెకు చెందిన శ్రీధర్‌. 
-భారత్‌లో ప్రజా రవాణా ద్వారా అత్యంత దూరం (29,119 కి.మీ) ప్రయాణించిన వారిగా జ్యోత్స్నా మిశ్రా, దుర్గా చరణ్‌.
-736 రకాల కాగితం కప్పులు సేకరించిన వ్యక్తిగా తమిళనాడుకు చెందిన శంకరనారాయణన్‌.
-పది బార్స్‌ కిందుగా అత్యంత వేగంగా స్కేట్‌ చేసిన (2.06 సెకండ్లు) ఘనతను నవీన్‌ కుమార్‌.
-2018లో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 30 వరకు భారత దేశం అంతటా 29 వేల 119 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన జోత్స్నా మిశ్రా, దుర్గా చరణ్ లు. 
ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2020 పుస్తకంలో పొందుపరిచారు.