International Dog Day : ఈ కుక్కలు వెరీ కాస్ట్లీ గురూ..

నేడు అంతర్జాతీయ డాగ్ దినోత్సవం. ఈ సందర్బంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి,అరుదైనవి, స్ట్రాంగ్ అయిన కుక్కలేవో తెలుసుకుందాం..

international dog day..the 10 most expensive dogs:‘కుక్క’ అని తేలిగ్గా తీసి పారేయొద్దు. కొన్ని కుక్కల్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకున్నా కొనుక్కోలేనంత ఖరీదులో ఉంటాయి. వాటిని పోషించాలన్నా..మెయిన్ టెయిన్ చేయాలన్న లక్షల్లో ఖర్చు అవుతుంది.వాటి బాగోగులు చూసుకోవటానికి భారీ జీతాలు ఇచ్చి మనుషుల్ని పెట్టుకోవాలి. ఖరీదైన కుక్కలు..శ్రీమంతుల ఇళ్లలో కుక్కల లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే కుక్క బతుకు అనే మాటకు అర్థం మారిపోవాల్సిందే. వాటి రాచభోగాల గురించి వింటే ధనవంతుల ఇంటిలో కుక్కగా పుట్టినా చాలు అనిపిస్తుంది. అటువంటి రిచెస్ డాగ్స్ గురించి ఈ అంతర్జాతీయ డాగ్స్ డే రోజున తెలుసుకుందాం..

Samoid: సమోయిడ్ కుక్క. వెరీ కాస్ట్లీ. సైబీరియా బ్రీడ్. 12 నుంచి 13 ఏళ్లు బతుకుతుంది. ఈ సైబీరియా బ్రీడ్ జాతి మగ కుక్కలు 20-29 కేజీలుంటే..ఆడ కుక్కలు 15-22కేజీలుంటాయి. ఈ కుక్క రేటు రూ.10లక్షలు. మరి ఓ లక్ష రూపాయలు సంపాదించటానికి ఓ సామాన్యుడు సంవత్సరాలు కూడా పట్టొచ్చు.అంటువంటిది ఈ సమోయిడ్ కుక్క ఖరీదే రూ.10 లక్షలు అంటే..దీన్ని కొనాలంటే సామాన్యులకు సాధ్యమవుతుందా? మరీ కోరిక ఉండీ ఈ కుక్కను కొనాలనుకునే ఓ మాదిరి లక్షాధికారులు ఆస్తులు అమ్ముకుంటునే గానీ దీన్ని కొనలేం.అందుకే మరి ఆస్తులు అందుకే ఆస్తులు అమ్ముకోవాలని అన్నది.

Lauchen: లాంచెన్. ఇవి చాలా చాలా అరుదైన కుక్కలు. 1973 నుంచి 65 మాత్రమే ఉన్నాయి.వీటికి తల నుంచి నడుము వరకు జూలు ఉంటుంది.ఆ జూలు నేల వరకు ఉంటుంది. వీటి సంఖ్యను పెంచటానికి జంతు నిపుణులు యత్నిస్తున్నారు. మరి వచ్చే డాగ్స్ డే కు అయినా వీటి సంతతి పెరగాలని కోరుకుందాం..

Chow Chow: భౌభౌలాగా… చౌచౌ పేరు లేదూ. ఇది చైనా బ్రీడ్. సింహం పిల్లలా ఉంటుంది. ఒళ్లంతా బొచ్చు పెరిగి భలే ముద్దుగా ఉంటాయి. చిన్న చెవులు,చిన్నతోకతో భలే క్యూట్ గా ఉంటుందీ చౌ చౌ డాగ్.

Tibetan Mastiff: టిబెటన్ మస్తిఫ్. దీని పేరులోనే టిబెట్‌ ఉండటానికి కారణం ఈ కుక్కలు టిబెట్‌లోనే కనిపిస్తాయి. ఇవి 2 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడుగుకు పైనే పెరగుతాయి. 50 నుంచి 90 కేజీల బరువు పెరగగలవు. 14 ఏళ్లపాటూ జీవిస్తాయి. వీటి జుట్టు వీటి కళ్లను మూసేస్తూ ఉంటుంది. దీన్ని సడెన్ గా చూస్తే సింహం అనుకుంటాం.నడుస్తుంటే రాజసం ఉట్టిపడుతుంటుంది.సింహం లాగే జూలు కూడా ఉంటుంది. భారీగా ఉంటుంది. టిబెటన్ మస్తిఫ్ చాలా అరుదైనది. వెరీ వెరీ స్ట్రాంగ్. సింహంలాగా. యజమానులకు మంచి బాడీగార్డ్. తన యజమాని భద్రతగాను, ఆప్యాయంగా చూసుకుంటుంది.

Ajawakh: అజవాక్ కుక్కలు పశ్చిమ ఆఫ్రికా, ఇంగ్లండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా 10 నుంచి 12 ఏళ్లవరకూ బతకగలవు. బరువు 15 నుంచి 25 కేజీలు పెరుగుతాయి. పొడుగు కాళ్ల వల్ల ఇవి అత్యంత వేగంగా పరుగెత్తగలవు. దీన్ని చూస్తే కాళ్లు కదపటానికి కూడా భయపడతాం.పొడవాటి కాళ్లు, పొడవాటి శరీరం వీటి ప్రత్యేకత. చాలా చురుకుగా ఉంటుంది.

 

Rottweiler: ఇది జర్మనీ బ్రీడ్. రొట్‌వెయిలెర్. సామాన్లు తీసుకెళ్లే కార్ట్స్ లాగేందుకు వీటిని వాడుతున్నారు. ఇవి 8 నుంచి 10 ఏళ్లు బతకగలవు. బరువు 60 కేజీల దాకా ఉంటాయి.

Canadian Eskimo: ఇది అచ్చం నక్కలా ఉంటుంది. ఇవి కెనడాలోనే పుట్టిన జాతి. వీటిని అరుదైన, అత్యంత ప్రాచీన జాతి కుక్కలుగా చెబుతారు. వీటిని ఎస్కిమో శునకం లేదా కెనడియన్ ఇన్యట్ డాగ్ అంటారు. ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. 2008 అంచనా ప్రకారం 300 స్వచ్ఛమైన కుక్కలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఇవి అంతరించిపోతుండటానికి కారణం అంటువ్యాధి వ్యాధుల వ్యాప్తి కూడా కారణంగా కనిపిస్తోంది. వీటి సంఖ్యను పెంచటానికి యత్నిస్తున్నారు.

Dogo Argentino: డోగో అర్జెంటినా.ఈ కుక్కను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అడుగు ముందుకేయటానికి ధైర్యం సరిపోవు. దొరికితే కండలు ఈడ పీకేసేలా ఉంటుంది. ఈ కుక్క డోగో అర్జెంటినా. చాలా కాస్ట్‌లీ డాగ్. వీటిని షికారీస్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Pharaoh Hound: ఫారో హౌండ్. యూరప్ జాతీయ కుక్క మాల్టా… ఈ జాతికి చెందినదే. దీన్ని రాబిట్ కాట్ వు డాగ్ అంటారు. క్వారీల్లో ఎక్కువగా వాడే ఈ కుక్క… కుందేలు కంటే వేగంగా పరుగెత్తగలదు. అందుకే కుందేళ్లను వదిలి… ఈ కుక్కల్ని వదులుతారు. ఆ వేటను చూసి ఎంజాయ్ చేస్తారు.

Afghan Hound: ఆప్ఘాన్ హౌండ్. ఇవి పేరుకు తగ్గట్టు ఆప్ఘనిస్థాన్‌లో కనిపిస్తాయి. ఈ కుక్క జుట్టు 69 సెంటీమీటర్ల దాకా పెరగగలదు. ఇవి 23 నుంచి 27 కేజీలు పెరగగలవు. పైనుంచి కిందకు జూలు జలపాతంలా జారి కనిపిస్తుంటుంది. జూలు వల్ల దాని చెవులు కూడా చాలా పొడవుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కుక్క పొడవు,ఎత్తుతో పోలిస్తే తోక చిన్నగా కనిపిస్తుంది.జూలు మాత్రం అచ్చం జలపాతాన్ని తలపించేలా ఉంటుంది. ఈ జూలుతో దాని కాళ్లు కూడా కనిపించనంతగా ఉంటుంది.

మరి చూశారా..ఈ కుక్కల్ని చూడటమే తప్ప కొనుకునే రేంజ్ లో ఉన్నాయా? వాటి సంరక్షణకు లక్షల రూపాయలు ఖర్చులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు