International Dog Day : ప్రతీ కుక్కకు వచ్చిందో రోజు..ఇదే ఆరోజు..

ఆగస్టు 26 అంతర్జాతీయ కుక్కల దినోత్సవం. ఈరోజు స్పెషల్ ఏంటీ?

International Dog Day speacial :ప్రతి కుక్కుకు ఓ రోజు వస్తుంది అని అంటుంటారు. అదే ఈ రోజు. ఆగస్టు 26. ప్రపంచ కుక్కల దినోత్సవం. ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకొంటారు..మరి కుక్కల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ కుక్కల రోజు ఎలా వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు ఈరోజు విశేషాలేంటీ? అనే విషయాలను తెలుసుకుందాం.

కుక్కల దినోత్సవం ఎప్పుడొచ్చింది..
రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను గురించి తెలియజేయటానికి..కుక్కల దత్తత గురించి అవగాహన పెంచటానికి ఏర్పడిన రోజు ఈ అంతర్జాతీయ కుక్కల దినోత్సవం. 2004లో కొలీన్ పైజ్ అనే ఒక రచయిత బీజం వేశారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఈయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే కోసం చాలా కృషి చేశారు.

అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు..?
ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా మీ కుక్కతో ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలి. మీ కుక్క సంక్షేమ సంస్థల కోసం వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దిక్కులేని కుక్కలకు సహాయం చేసే సంస్థలకు విరాళాలు ఇవ్వటం..అటువంటి కుక్కలకు ఆహారం అందించటం వంటివి చేయొచ్చు.

శునకాల వల్ల ప్రయోజనాలివే..
కుక్కల్ని గ్రామ సింహం అని కూడా అంటాం. ఇవి గ్రామంలో ఉంటే దొంగలు అటువైపు రావటానికే భయపడిపోతారు. ఊరంతా నిద్రపోయినా కుక్కలు నిద్రపోవు.చిన్న చప్పుడు వస్తే చాలా మొరుగుతాయి. కుక్కలు ఎక్కువగా అరుస్తున్నాయంటే దొంగలు వచ్చినట్లుగా అనుమానించాల్సిందే. లేక ఇంకేవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లు అనుకోవాలి.

అలాగే బాంబులు పెట్టినట్లయితే వాటిని గుర్తించడంలో శునకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన ఆర్మీలో కుక్కల పాత్ర అంత్యంత కీలక మైనది.అంతేకాదు. నేరస్తులు పట్టించటంలో పోలీసులకు ఎంతగానో ఉపయోపడుతున్నాయి జాగిలాలు.

హత్య లేదా ఇతర నేరాలు జరిగినప్పుడు నేరస్థుల్ని పట్టించటంలో పోలీసులకు జాగిలాలు ఎంతగానోఉపయోపడుతున్నాయి. పోలీసులకు క్లూలు సైతం అందిస్తున్నాయి. ఎన్నో కేసుల పరిష్కారంలో పోలీసు జాగిలాలు కీలకంగా మారుతున్నాయి. వీటి ద్వారా ఎన్నో హత్య కేసులు, ఇతర కేసులను చేధించిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో.

కాస్త అన్నం పెడితే చాలు విశ్వాసంగా పడి ఉంటాయి. శునకాలకు అసూయ అనేదే ఉండదు. చెడు అంటే ఏమిటో వాటికి తెలియదు. కేవలం తమను ఆదరించినవారిని ప్రేమించడం మాత్రమే తెలుసు. వాటికి స్నేహపూర్వకంగా ఉండటమే తెలుసు. పెంపుడు కుక్కలే కాదు వీధి కుక్కలు కూడా వారి వారి ఏరియాల్లోకి దొంగలు పడితే మొరిగి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటాయి. ఇవే కాకుండా కుక్కల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయనే విషయం ఈ అంతర్జాతీయ డాగ్ డే రోజున తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

 

ఇంటర్నేషనల్ డాగ్ డే మెసెజ్ లు..
మీరు స్కూలుకో లేదా కాలేజీకో లేదా ఆఫీసుకో ఇంకా ఏదైనా వేరేచోటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక మీలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని తీసుకురావటానికి మీ ఇంట్లో మీరు పెంచుకునే కుక్క. లేట్ గా యజమాని వస్తే ఎంతో ఆతృతగా..ఎదురుచూసేది పెంపుడు కుక్క. యజమాని రాగానే ఎదురెళ్లిపోతుంది.గుండెలపై కాళ్లు పెట్టి తోక ఊపుతు తన ప్రేమను తెలియజేస్తుంది.

కుక్కతో కాసేపు ఆడుకుంటే అలసట అంతా పోతుంది.కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా మీ పెంపుడుకుక్కల కోసమే కాకుండా దిక్కులేని కుక్కల కోసం కాస్త సమయాన్ని కేటాయించి వాటికి కడుపునిండా ఆహారం పెట్టండి. వాటిని ప్రేమగా పలకరించండీ..

ట్రెండింగ్ వార్తలు