Iran arrest Oscar winning movie actress for backing anti-regime protests
Iran: ఇరాన్లో ప్రారంభమైన హిజాబ్ వివాదం వారాల తరబడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, ఈ నిరసనలో పాల్గొన్న వారిపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందల మందిని జైళ్లలో వేశారు. కొందరు ఇరాన్ మూకల కాల్పులు, అతి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ నిరసనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ నిరసనలో పాల్గొని హిజాబ్‌పై వ్యతరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే వీరిని కూడా అక్కడి ప్రభుత్వం వదలట్లేదు. వారిపై కూడా దుర్మార్గ చర్యలకు పాల్పడుతోంది అక్కడి ప్రభుత్వం.
Indian-China Clash: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ వివాదం.. ఆ ఫొటో ఇప్పటిది కాదా?
తాజాగా ఆస్కార్ బహుమతి గెలుచుకున్న ‘ద సేల్స్‌మ్యాన్’ అనే మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38) అనే నటిని ఇరాన్ మూకలు అరెస్ట్ చేశాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్‌కు చెందిన తస్నిమ్ న్యూస్ పేర్కొంది. హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచివేతదారులకు మద్దతు ఇవ్వడమే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం అవమానకరం’’ అని పోస్ట్ చేశారు.