Iran Drones Attack : బహ్రెయిన్‌లో పేలుళ్ల కలకలం.. అమెరికా స్థావరమే టార్గెట్‌గా ఇరాన్ డ్రోన్ల దాడి!
Iran Drones Attack : బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఆరు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పేలుళ్లు, సైరన్లతో బహ్రెయిన్‌లో కలకలం రేగగా.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
- Sreehari A
- Published on- November 15, 2026 / 05:34 PM IST
Iran Drones Attack
- గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు..
- అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- బహ్రెయిన్‌లో పేలుళ్లు, సైరన్లతో టెన్షన్
Iran Drones Attack : గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. బహ్రెయిన్‌లో వరుస పేలుళ్లు, సైరన్ల మోతతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది..
బహ్రెయిన్‌లోని అల్-రిఫా హెలికాప్టర్ స్థావరం వద్ద ఉన్న అమెరికా సైనిక స్థావరంపై 6 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. అమెరికా నుంచి ఎలాంటి దురాక్రమణ జరిగినా గతంలో కన్నా మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.
Read Also : MLA Harish Singh Dhami : సీఎం ముందే మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని రచ్చ.. మైక్ విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పేలుళ్లు, సైరన్ల శబ్దాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ :
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా మరోసారి తప్పు చేస్తే పరిణామాలు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? యుద్ధం కొనసాగుతుందా? అనే దానికంటే తమ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాతో ఒప్పందం కుదరాలంటే ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. లేదంటే యుద్ధ రంగంలో పరిస్థితులను తమ సాయుధ దళాలే నిర్ణయిస్తాయని హెచ్చరించారు.
