Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ కు మొత్తం 312 ఎలక్ట్రోరల్ ఓట్లు రాగా.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్ట్రోరల్ ఓట్లు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడికిగా వచ్చే ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని.. ఇరాన్ కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఈ మేరకు మన్ హట్టన్ లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలను నమోదు చేసింది.
Also Read: Israel: లెబనాన్ పై మరోసారి వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయెల్
ఎన్నికల ప్రచారం సందర్భంగానే ట్రంప్ ను హత్య చేయాలని తమకు సూచనలు అందాయని, తర్వాత ప్రణాళిక మారిందని ఫర్జాద్ షేకేరీ తెలిపినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. ఇరాన్ లో ఉంటున్న ఫర్జాద్ షకేరీ అమెరికాలో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఈ హత్య ప్రణాళికను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్నాడని, వారిని అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అయితే, ట్రంప్ హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అసత్యపు వాదనల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసేవిగా ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాకీ ట్విటర్ లో పేర్కొన్నారు.
హంతకుడు ఇరాన్ లో కూర్చుని ఎఫ్ బీఐతో ఆన్ లైన్ లో మాట్లాడుతున్నారనేదాన్ని ఎవరు నమ్ముతారు..? అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఇరాన్ గౌరవిస్తుంది. రెండు వైపుల నుంచి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం అని అరాకీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
Remember the assassination of Ismail Haniyeh in Tehran right after our President’s inauguration? Everyone knows who did it and why.
Now, with another election, a new scenario is fabricated with the same goal: as a killer does not exist in reality, scriptwriters are brought in…
— Seyed Abbas Araghchi (@araghchi) November 9, 2024